పాల ప్యాకెట్ కోసం వెళ్లిన చిన్నారి… చివరకు ..?  

Child Girl Died, Milk packet, Child Girl Went to Shop, Rain, Drainage - Telugu Child Girl Died, Child Girl Went To Shop, Drainage, Milk Packet, Rain

పాల ప్యాకెట్ కోసం బయటికి వెళ్ళిన ఓ చిన్నారి తన నూరేళ్ల జీవితాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది.పాల ప్యాకెట్ కోసం వెళ్లిన చిన్నారి తిరిగి వస్తుందని అనుకున్న తల్లిదండ్రులకు చివరికి నిరాశే మిగిలింది.

 Child Girl Drainage Died

అసలు విషయంలోకి వెళితే… తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన దుర్గాప్రసాద్, పల్లవి దంపతుల కూతురు చంద్రకళ.దుర్గాప్రసాద్ స్థానికంగా వడ్రంగి పని చేస్తూ జీవనం కొనసాగించేవారు.

కూతురు స్థానిక మున్సిపల్ స్కూల్లో రెండో తరగతి చదువుతోంది.

పాల ప్యాకెట్ కోసం వెళ్లిన చిన్నారి… చివరకు ..-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఆదివారం సాయంత్రం చిన్నారి పాల ప్యాకెట్ కోసం దుకాణానికి వెళ్ళింది.

అయితే అప్పటికే భారీగా కురిసిన వర్షంతో దుకాణం సమీపంలో ఉండే మంగలి బోదె డ్రైనేజ్ చాలా వేగంగా ప్రవహిస్తుంది.పాల ప్యాకెట్ తీసుకున్న చిన్నారి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో పాప కాలికి వేసుకున్న చెప్పు జారిపోవడంతో దాన్ని తీసుకునే ప్రయత్నంలో ఆ అమ్మాయి అక్కడి నీటి ప్రవాహ వేగానికి డ్రైనేజ్ లో పడి కొట్టుకు పోయింది.

ఈ విషయాన్ని అక్కడే ఉన్న ఇద్దరు స్థానికులు గమనించి చిన్నారి తల్లికి విషయాన్ని అందజేశారు.దీంతో కన్నతల్లి డ్రైనేజ్ వెంబడి పరుగులు పెట్టడం చూసి స్థానికులు పెద్ద ఎత్తున డ్రైనేజ్ లోకి దిగి పాపను వెతకడానికి ప్రయత్నించారు.

ఈ ప్రయత్నంలో అమ్మాయి కొట్టుకుపోయిన స్థలం నుండి కిలోమీటర్ దూరంలో దొరకగా, పాపను ఆస్పత్రికి వెంటనే తీసుకుపోయిన సరే వారి ప్రయత్నం నీరుగారింది.చిన్నారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించిందని నిర్ధారించారు.

ఈ విషయంపై స్థానిక అధికారులు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.

#Milk Packet #Drainage #Child Girl Died #Rain

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Child Girl Drainage Died Related Telugu News,Photos/Pics,Images..