చిన్నారి ప్రాణం తీసిన కరెంట్ పోల్! హైదరాబాద్ లో దారుణం!  

హైదరాబాద్ లో గండిపేట సమీపంలో పెబల్ సిటీ గ్రూప్ అపార్ట్మెంట్స్ లో కరెంట్ షాక్ తలిగి చిన్నారి బాలుడు మరణించాడు. .

హైదరాబాద్ నగరంలో నిర్లక్ష్యం ఎ స్థాయిలో వుందో మరో సారి స్పష్టం అయ్యింది. గ్రౌప్స్ హౌస్, అపార్ట్ మెంట్స్ లో రియల్టర్ లు కనస్ట్రక్షన్ కి ఇచ్చే ప్రాధాన్యత అక్కడ నివాసం వుండే వారి రక్షణకి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన రెగ్యులర్ గా ప్రమాదాలు జరుగుతూ వస్తూ వుంటాయి. రోడ్డు మీద, కాలనీలలో వుండే విద్యుత్ స్తంభాల చుట్టూ రక్షణ ఏర్పాట్లు లేకుండా వదిలేయడం ఈ రోజు ఓ చిన్నారి ప్రాణాలు పోయాయి. సరదాగా ఆడుకుంటూ కరెంట్ పోల్ ని టచ్ చేసిన చిన్నారి బాలుడు కరెంట్ షాక్ తగిలి క్షణాల్లో ప్రాణాలు కోల్పోయాడు.

వివరాల్లోకి వెళ్తే గండి పేట పెబల్ సిటీ అనే గ్రూప్ అపార్ట్ మెంట్స్ లో ఏళ్ల బాలుడు స్విమింగ్ పూల్ పక్కన విద్యుత్ స్థంభం పట్టుకొని కరెంట్ షాక్ తో ప్రాణాలు కోల్పోయాడు. పిల్లలు అందరూ ఆడుకుంటూ వుండగా వారిలో ఓ పిల్లాడు అలా వెళ్లి స్థంభం పట్టుకున్నాడు. దాంతో కరెంట్ షాక్ తగిలి ఆ పిల్లాడి అలా కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలేసాడు. ఈ ఘటనతో స్థానికంగా అపార్ట్మెంట్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మరి దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది చూడాలి