సోలో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న చైల్డ్ ఆర్టిస్ట్... ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో

ఇంద్ర, యువరాజు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెరిసి అందరిని ఆకట్టుకున్న బాల నటుడు తేజ్.ఆ సినిమాలు అతని కెరియర్ లో బెస్ట్ మూవీస్ గా చెప్పాలి.

 Child Artist Teja Become Solo Hero In Prashanth Varma Director-TeluguStop.com

యువరాజు సినిమా ఫ్లాప్ అయిన ఈ బుడ్డోడు చేసిన యాక్టింగ్ మాత్రం అందరిని ఫిదా చేసింది.ఇక ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు కుర్రాడు అయిపోయాడు.

గత ఏడాది సమంత ఓ బేబీ సినిమాలో కీలక పాత్ర చేశాడు.సమంత తన డ్రీం ని ఫుల్ ఫిల్ చేసుకోవడానికి సహకరించే టీనేజ్ కుర్రాడిగా, ఆమె మనవడిగా అలరించాడు.

ఇదిలా ఉంటే ఈ బుడ్డోడు చాలా రోజులుగా సోలో హీరోగా ఎంటర్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.ఇప్పుడు అతని ప్రయత్నాలు ఫలించాయని చెప్పాలి.

ఈ ఏడాది తేజ్ సోలో హీరోగా ఒక సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది.ఇక ఈ సినిమా ఆ సినిమాతో క్రియేటివ్ దర్శకుడుగా సత్తా చాటిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోతుందని సమాచారం.

ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు తెలుస్తుంది.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా ఈ నెలాఖరులోగా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని టాలీవుడ్ లో వినిపిస్తుంది.

ఇందులో తేజ్ సరసన ఓ కొత్త మోడల్ హీరోయిన్ గా పరిచయం అవుతుందని టాక్ వినిపిస్తుంది.ఆ, కల్కీ సినిమాలతో విభిన్న దర్శకుడుగా సత్తా చాటిన ప్రశాంత్ వర్మ తేజ్ ని ఎలా తెరపై రిప్రజెంట్ చేస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube