హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న ఒక్కడు మూవీలో మహేష్ బాబు చెల్లి

సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత స్టార్ హీరోయిన్స్ గా ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.అతిలోక సుందరి శ్రీదేవి, మీనా, రాశి, కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యూయేల్, అవికాగౌర్ లాంటి చాలా మంది హీరోయిన్స్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత హీరోయిన్స్ అయినవారే కావడం విశేషం.

 Child Artist Niharika Ready To Enter As A Heroine-TeluguStop.com

వీరిని స్పూర్తిగా తీసుకొని చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్లు హీరోయిన్స్ గా మారే ప్రయత్నం చేస్తున్నారు.కొంత మంది సక్సెస్ అయితే కొంత మంది రెండు, మూడు సినిమాలకే కనుమరుగు అవుతున్నారు.

టాలెంట్ ఉన్న ఉన్న హీరోయిన్ మెటీరియల్ కాకపోవడం, అలాగే సరైన అవకాశాలు రాకపోవడంతో కొంత మంది వెనక్కే ఉండిపోతున్నారు.ఇప్పుడు మరో చైల్డ్ ఆర్టిస్ట్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది.

 Child Artist Niharika Ready To Enter As A Heroine-హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న ఒక్కడు మూవీలో మహేష్ బాబు చెల్లి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒక్కడు సినిమాలో మహేష్ బాబుని టీజ్ చేసే చెల్లి పాత్రలో నటించిన అమ్మాయి నిహారిక.

ఈ అమ్మడు చైల్డ్ ఆర్టిస్ట్ గా వెంకటేష్, మోహన్ బాబుతో కూడా నటించింది.

ఇప్పుడు 25 ఏళ్ల వయస్సులో ఉన్న ఈ బ్యూటీ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం కోసం వేచి చూస్తుంది.ఇప్పటికే మోడల్ గా మారి ఫోటో షూట్ లు చేస్తూ టాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షించే పనిలో ఉంది.

ఒక్క అవకాశం వచ్చిన దానిని వినియోగించుకొని తన టాలెంట్ ఏంటో చూపించడానికి నిహారిక సిద్ధంగా ఉంది.మరి స్టార్ హీరోయిన్స్ అయిన చైల్డ్ ఆర్టిస్ట్స్ మాదిరి ఈ భామ కూడా ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటుందో లేదో తెలియాలంటే మొదటి సినిమా వచ్చే వరకు వేచి చూడాలి.

ఇప్పటికే నిహారిక హీరోయిన్ గా ఒకటి, రెండు సినిమాలు సిద్ధం చేసుకుందనే మాట ఇప్పుడు వినిపిస్తున్న నేపధ్యంలో ఆమె ఎంట్రీ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి.

#Niharika #SuperStar #Heroine

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు