27 ఏళ్ల వయసుకే 25 ఏళ్ల సినీ జీవితం.. ఈ కుర్రాణ్ని గుర్తుపట్టారా?     2018-07-18   11:34:50  IST  Sai Mallula

‘పెదరాయుడు’ సినిమాలో పాపారాయుడి మేనల్లుడు ఓ పేదింటి అమ్మాయిని రేప్ చేస్తాడు. దీనిపై పాపారాయుడు ఏర్పాటు చేసిన పంచాయతీలో పాపారాయుడు మేనల్లుడుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ఎవ్వరూ ముందుకు రారు. ‘ఆ అమ్మాయిని వీడు పాడుచేయడం ఎవరైనా చూశారా’ అంటూ గంభీరంగా అడుగుతాడు పాపారాయుడు.. ఒక్కరూ నోరు విప్పరు ..అందరూ తలలు దించుకుంటారు..అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం.. అప్పుడు ‘నేను చూశాను తాతయ్య’ అంటూ ఓ చిన్న పిల్లాడు ముందుకు వస్తాడు. ఆ పిల్లాడు గుర్తున్నాడా…అతడే మహేంద్రన్..ఇంతింతై వటుడింతై అనే సామెత తెలుసు కదా.. మహేంద్రన్ విషయంలో ఆ సామెత రివర్స్ వటుడింతై ఇంతైయ్యాడు మహేంద్రన్ ..ఎలా అంటారా..తెలుసుకోవాలంటే చదవండి మరీ…

Child Artist Mahendran Turned A Hero Now-

Child Artist Mahendran Turned A Hero Now

తెలుగులో ‘పెదరాయుడు’, ‘పెళ్లిచేసుకుందాం’, ‘ఆహా..!’, ‘దేవి’, ‘లిటిల్ హార్ట్స్’, ‘సింహాద్రి’ తదితర చిత్రాల్లో బాల నటుడిగా నటించిన మహేంద్రన్ తెలుగు వాడు ..సొంత ఊరు తమిళనాడు..సినిమా రంగ ప్రవేశం కూడా తమిళంలోనే జరిగింది..అది కూడా రెండేళ్ల వయసులో.. 1994లో ‘నట్టమయి’ సినిమా ద్వారా సినిరంగ ప్రవేశం చేశాడు…ఆ తర్వాత బాలనటుడిగా నుండి హీరోగా ఎదిగాడు… శ్రీదేవి, రాశి, కమల్ హాసన్, తరుణ్ వరకు ఇలా చాలా మంది బాల నటులుగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆ తరవాత పెద్ద స్టార్లుగా ఎదిగారు. అయితే వీరంతా బాల నటులుగా చేసిన చిత్రాల కంటే హీరోలుగా, హీరోయిన్లుగా చేసి స్టార్లయినవారే… కానీ మహేంద్రన్ మాత్రం బాల నటుడిగానే రికార్డులు సృష్టించాడు. మొత్తం మూడు భాషల్లో అత్యధిక సినిమాల్లో నటించిన బాల నటుడిగా నిలిచాడు.

తెలుగులో రెండుసార్లు ఉత్తమ బాల నటుడిగా నంది అవార్డులు కూడా అందుకున్నాడు. తమిళంలో బాల నటుడిగా ఎక్కువ సినిమాలు చేశాడు. తెలుగు, తమిళం, మలయాళంలో కలిపి సుమారు 167 సినిమాలు చేయగా.. వాటిలో 130కి పైగా బాల నటుడుగా చేసినవి కావడం విశేషం. 27ఏళ్ల ఈ యంగ్ హీరో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 25 ఏళ్లు పూర్తయ్యాయి…కాబట్టి మహేంద్రన్ మరింత సక్సెస్ కావాలని కోరుకుందాం..ఆల్ ది బెస్ట్ ..