అల్లుఅర్జున్ హీరోయిన్ ఇప్పడు ఎలా ఉందో తెలుసా...

2003వ సంవత్సరంలో ప్రముఖ సినీ నిర్మాత కొడుకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన టువంటి గంగోత్రి సినిమా తెలుగు ప్రేక్షకులకు బాగానే గుర్తు ఉంటుంది.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కె.

 Child Artist Kavya Want Re Entry To The Tollywood-TeluguStop.com

రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా అశ్వనీదత్ అల్లు అరవింద్ సంయుక్తంగా కలిసి నిర్మించారు.ఈ చిత్రం సంగీతం పరంగా కూడా బాగా హిట్ అయింది.

ఈ చిత్రంలోని పాటల్లో ముఖ్యంగా అల్లు అర్జున్ చిన్నప్పుడు నటించినటువంటి  “వల్లంకి పిట్ట” అనే పాట మంచి ప్రేక్షకాదరణ పొందింది.అయితే ఈ పాటలో నటించినటువంటి చిన్నారి కావ్య గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గంగోత్రి లో “వల్లంకి పిట్ట, వల్లంకి పిట్ట” అంటూ అల్లు అర్జున్ తో  చిన్నప్పుడు చిందులేసినటువంటి ఈ చిన్నది గంగోత్రి తర్వాత కొన్ని చిత్రాల్లో కూడా నటించింది.అయితే ఆ చిత్రాల్లో కావ్య పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో పెద్దగా గుర్తింపు రాలేదు.

దీంతో కావ్య తల్లిదండ్రులు కొన్ని రోజులు ఈమెని సినీ పరిశ్రమ కి దూరంగా ఉంచి చదివించారు.ఇటీవల కాలంలో కావ్య లా కోర్సు పూర్తిచేసుకుని పట్టా కూడా పొందింది.

Telugu Alluarjun, Kavya Gangothri, Kavya Latest, Kavya-Movie

దీంతో ప్రస్తుతం మళ్లీ కావ్య సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది.ఇప్పటికే ఈ విషయానికి సంబంధించి కొన్ని సినిమాలకు ఆడిషన్లు కూడా ఇచ్చింది.అంతేగాక తన తల్లిదండ్రులతో సన్నిహితంగా ఉంటున్న టువంటి ఓ దర్శకుడు కూడా కావ్య ని తెలుగు పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.అయితే గంగోత్రి లో చిన్న పాప పాత్రలో ఆకట్టుకున్నటువంటి కావ్య ఇప్పుడు హీరోయిన్ గా ఎలా రాణిస్తుందో చూడాలి.

అయితే ఇటీవల కాలంలో దేవుళ్ళు చిత్రంలో చిన్నారి పాత్రలో నటించిన టువంటి నిత్య శెట్టి కూడా బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించి ఉద్యోగం చేయడం ఇష్టం లేక హీరోయిన్ గా తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టింది.అయితే ఇక్కడ అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు నిత్య శెట్టి అందుబాటులో ఉంటోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube