అంటే సుందరానికి సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ హారిక ఎవరో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో చైల్డ్ ఆర్టిస్టులకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది.ప్రతి సినిమాలోని హీరో హీరోయిన్లు చిన్నప్పటి పాత్రలలో నటించడం కోసం చైల్డ్ ఆర్టిస్టులు ముఖ్యమైన పాత్రధారులుగా ఉంటారు.

 Child Artist Harika Is Who Acted In The Movie Ante Sundaraniki Child Artist Hari-TeluguStop.com

ఈ క్రమంలోనే ఇప్పటికే ఇండస్ట్రీలోకి ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులు ఎంట్రీ ఇచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.ఇక ఆ చైల్డ్ ఆర్టిస్టులే పెద్దవారిగా మారి సినిమాలలో కూడా నటిస్తున్నారు.

ఇప్పుడిప్పుడే కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులు సినిమాలలో కూడా అడుగు పెడుతున్నారు.అందులో ఒకరు అంటే సుందరానికి సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ హారిక.

డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘అంటే సుందరానికి’.ఈ సినిమాలో నాచురల్ స్టార్ హీరో నాని, నజ్రియా నజీమ్ నటీనటులుగా నటించారు.

అంతేకాకుండా హర్షవర్ధన్, అజగం పెరుమాల్, నదియా, నిక్కీ తంబోలి, రోహిణి తదితరులు నటించారు.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రవిశంకర్, సి వి మోహన్ నిర్మాతగా బాధ్యతలు చేపట్టారు.

ఇక ఈ సినిమా కామెడీ ఎంటర్ టైన్ మెంట్ నేపథ్యంలో తెరకెక్కింది.కానీ ఈ సినిమా ఎందుకో ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేకపోయింది.

కానీ ఇందులో నటించిన నటీనటులు మాత్రం తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.ఇందులో ముఖ్యంగా నజ్రియా చిన్నప్పటి పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ హారిక మాత్రం తన పాత్రతో బాగా మెప్పించింది.

అయితే ఈమె నటన సంగతి పక్కకు పెట్టినట్లయితే.ఇంతకీ ఈమె ఎవరో చాలావరకు తెలుగు ప్రేక్షకులు గుర్తుపట్టలేకపోయారు.

నిజానికి ఈ చైల్డ్ ఆర్టిస్ట్ హారిక తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమున్న చైల్డ్ నటి.ఇప్పటికి తనని ఇంకా గుర్తుపట్టలేదా.

అదేనండయ్ స్టార్ మా లో ప్రసారమైన కోయిలమ్మ సీరియల్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన పాపనే హారిక.ఆ సీరియల్ లో ఇప్పుడున్న హారిక కి ఇప్పుడు ఉన్న హారిక కి చాలా తేడా ఉందనే చెప్పాలి.

కోయిలమ్మ సీరియల్ లో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయింది హారిక.ఇక ఈ సీరియల్ తరువాత మళ్ళీ ప్రేక్షకులకు అంతగా కనిపించలేదు హారిక.కానీ ఇటీవలే విడుదలైన అంటే సుందరానికి సినిమాలో నటించడంతో తనను గుర్తుపట్టిన వాళ్లంతా షాక్ అయ్యారు.తాను కోయిలమ్మ చైల్డ్ ఆర్టిస్ట్ కదా అని వెంటనే అనేశారు కూడా.

కేవలం ఆ సినిమాలోనే కాకుండా.అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది హారిక.

ఇక వైష్ణవ తేజ్ నటిస్తున్న రంగ రంగా వైభవంగా సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తుందని తెలుస్తుంది.మొత్తానికి బుల్లితెర నుండి వెండితెరపై అడుగుపెట్టిన హారిక వరుస సినిమాలలో బాగానే అవకాశాలు అందుకుంటుంది.

ఇక హారిక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube