సూర్యవంశం, మనసంతా నువ్వే లో ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా.? ఇప్పుడు హీరో లా ఎలా ఉన్నాడో చూడండి!

ఆనంద్ వర్దన్ గుర్తున్నాడా….తూనీగా తూనీగా ఎందాకా పరిగెడతావే రావే నా వంక దూరంగా పోనీక ఉంటాలే నీ వెనకాలే రానీ సాయంగా పాటలో నటించిన అబ్బాయి.

 Child Artist Anand Vardhan Set To Make His Entry On Silver Screen As A Hero1-TeluguStop.com

అంతకు ముందు జగపతి బాబు ప్రియరాగాలు ,వెంకటేశ్ సూర్యవంశం, యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన శ్రీ మంజునాధలో కూడా చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు…గుర్తొచ్చాడా ఆ అబ్బాయే.ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

ఆనంద్ వర్దన్ గురించి,తను ఎంట్రీగా ఇవ్వనున్న సినిమా కొన్ని ఆసక్తికరమైన విషయాలు.

మూడున్నరేళ్లకే బాలనటుడిగా బాలరామాయణం సినిమా ద్వారా పరిచయం అయ్యాడు.బాలరామాయణంలో వాల్మీకి గా,బాలాంజనేయుడిగా రెండు పాత్రలు పోషించాడు.‘ప్రియరాగాలు సినిమాలో బోర్ కొట్ట‌గానే ఎవ‌రిదో ఒక‌రి పుట్టిన రోజు తేదీని ఫోన్ నెంబ‌ర్ గా ఫోన్ చేసి అవ‌త‌లి వారితో ఆడుకునే కుర్రాడిగా నటించాడు.

ప్రియరాగాలు సినిమాలో తన నటనకు గానూ నంది అవార్డు కూడా తీసుకున్నాడు ఆనంద్.

తెలుగులో వచ్చిన సూర్యవంశంని హిందీలో డబ్ అయిన సూర్యవంశ్ సినిమాలో అమితాబ్ తో నటించడం నాకు చాలా గ్రేట్ అని చెప్పుకునే ఆనంద్ వర్దన్.ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించాడు.ప్ర‌స్తుతం హీరోగా ఎంట్రీ ఇవ్వ‌డానికి రెడీ అవుతున్నాడు.ఇంజనీరింగ్ పూర్తిచేసి డాన్స్ నేర్చుకుంటోన్న ఆనంద్ వర్ధన్, త్వరలో ‘ఆకాశవాణి’ చిత్రంలో నటించనున్నాడు.ఈ సినిమాలో ఆనంద్ వర్దన్ తో పాటు మరొక హీరో కూడా నటిస్తున్నాడట.

బాలనటుడుగా నిరూపించుకున్న ఆనంద్ వర్ధన్ హీరోగా కూడా నిరూపించుకోవాలని ఆశిద్దాం… ఆల్ ది బెస్ట్ ఆనంద్.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube