వెంకటేష్ మనవడు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా?  

child artist anand vardhan complete information - Telugu Anand Vardan, Balarayanam, Child Artist, Suryavamsa

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లుగా ప్రతిభ చూపి హీరోహీరోయిన్లుగా ఇండస్ట్రీలో అవకాశాలు సాధిస్తున్న సంగతి తెలిసిందే.అలా చిన్నతనంలోనే చాలా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ లలో ఆనందవర్ధన్ ఒకరు.

TeluguStop.com - Child Artist Anand Vardhan Photo Viral

సూర్యవంశం సినిమాలో వెంకటేష్ మనవడిగా నటించిన ఆనందవర్ధన్ ఆ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఆనంద వర్ధన్ దాదాపు పాతిక సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.

మన స్టార్ హీరోల చిన్నప్పటి పాత్రలను పోషించి బాల్యంలోనే నటుడిగా తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్నారు.ప్రముఖ నేపథ్య గాయకుడు దివంగత పీబీ శ్రీనివాస్ మనుమడు ఆనంద వర్ధన్.

TeluguStop.com - వెంకటేష్ మనవడు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

మనసంతా నువ్వే, ఎగిరే పావురమా, ప్రియరాగాల, బాల రామాయణం, ప్రేమించుకుందాం రా సినిమాలు ఆనందవర్ధన్ కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. హైదరాబాద్లో సీ.ఎం.ఆర్ కాలేజీలో బీటెక్ చదివిన ఆనందవర్ధన్ త్వరలో సిల్వర్ స్క్రీన్ పై కనిపించనున్నారు.

తాత పీబీ శ్రీనివాస్ మనుమడు నటుడు కావాలని ఆశించగా తాత కన్న కలలను నిజం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.చిన్న వయస్సులోనే ఆనందవర్ధన్ రోజుకు రెండుమూడు సినిమాల్లో నటించాడంటే అతని టాలెంట్ సులభంగానే అర్థమవుతుంది.

తెలుగులోనే కాదు హిందీ సూర్యవంశంలో కూడా అమితాబ్ మనవడి పాత్రలో నటించి ఆనందవర్ధన్ మెప్పించాడు.అనందవర్ధన్ తండ్రి ఫణీందర్ ఛార్టర్డ్ అకౌంటెంట్ గా పని చేసేవారు.

ఐదేళ్ల వయస్సులో బాల రామాయణం సినిమాలో బాల హనుమంతుని పాత్రలో వాల్మీకి పాత్రలో నటించాడంటే ఆనందవర్ధన్ ప్రతిభ సులభంగానే అర్థమవుతుంది.ఆనందవర్ధన్ నటించిన ప్రియరాగాలు అనే సినిమాకు ఉత్తమనటుడిగా నంది అవార్డ్ వచ్చింది.

ఆనందవర్ధన్ తెలుగు, హిందీ మాత్రమే కాకుండా తమిళ భాషలోనూ పలు సినిమాల్లో నటించారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన ఆనందవర్ధన్ వెండితెరపై ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి.

#Suryavamsa #Balarayanam #Child Artist #Anand Vardan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Child Artist Anand Vardhan Photo Viral Related Telugu News,Photos/Pics,Images..