టీడీపి పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి..!!

బద్వేల్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే నామినేషన్ల పర్వం కంప్లీట్ అయిన సంగతి తెలిసిందే.అక్టోబర్ 30వ తారీఖున జరగనున్న ఈ ఎన్నికలకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పార్టీలు దూరంగా ఉన్నాయి.

 Chief Whip Srikanth Reddy Made Serious Comments On Tdp-TeluguStop.com

సంప్రదాయాలను గౌరవిస్తూ.మరణించిన వ్యక్తి భార్య కు అధికార పార్టీ వైసీపీ టికెట్ కేటాయించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టిడిపి జనసేన పార్టీ లు వెల్లడించాయి.

అంతేకాకుండా ఎన్నికలు ఏకగ్రీవం చేసేలా వ్యవహరించాలని కూడా కోరాయి.ఇటువంటి తరుణంలో బద్వేలు ఉపఎన్నికల కి.ప్రారంభంలో 27 మందినామినేషన్ వేయగా నామినేషన్ల పరిశీలన లో తొమ్మిది మంది తిరస్కరణకు గురి అయ్యారు.

 Chief Whip Srikanth Reddy Made Serious Comments On Tdp-టీడీపి పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

  ఈ క్రమంలో బుధవారం మరికొంతమంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.

అయితే చివరిగా పోటీలో 15 మంది అభ్యర్థులు నిలిచారు.ఇటువంటి తరుణంలో బద్వేల్ అభివృద్ధి గురించి తాజాగా వైసిపి చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.టీడీపి అధికారంలో ఉన్న సమయంలో నియోజకవర్గంలో కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదని ఆరోపించారు.కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక బ్రహ్మంసాగర్ ద్వారా ఏడు మండలాలకు నీరు అందించడం జరిగిందని స్పష్టం చేశారు.తాగు నీరు తో పాటు సాగునీటిని కూడా వైసీపీ అధికారంలోకి వచ్చాక బద్వేల్ నియోజకవర్గానికి ఇవ్వడం జరిగిందని 130 కోట్ల రూపాయలతో బద్వేల్ మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తామని.

ఈ క్రమంలో వైఎస్ఆర్ సీపీ పార్టీ అభ్యర్థి దాసరి సుధ నీ భారీ మెజార్టీతో… గెలిపించాలని కోరారు.

#Ysrcp #Badvel #Brahmansagar #Srikanth Redy #Chandra Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు