వెనక్కి తగ్గిన ఇరు రాష్ట్రల ముఖ్యమంత్రులు...!!

అస్సాం .మిజోరాం రెండు రాష్ట్రాల సరిహద్దు వద్ద ఇటీవల ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

 Chief Ministers Of Both The States Who Have Fallen Behind-TeluguStop.com

ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఎవరికి వారు నువ్వానేనా అన్నట్టుగా వ్యవహరించడంతో.సరిహద్దుల వద్ద పరిస్థితి చేయి దాటిపోయి.

ఇరు రాష్ట్రాల పోలీసులు ఒకరిపై ఒకరు కాల్పులు కూడా జరుపుకోవడం జరిగింది.ఈ క్రమంలో అస్సాం రాష్ట్రానికి చెందిన ఆరుగురు పోలీసులు మరణించారు.

 Chief Ministers Of Both The States Who Have Fallen Behind-వెనక్కి తగ్గిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు…-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇటువంటి తరుణంలో.తాజాగా ఈ విషయంలో కేంద్రం ఎంట్రీ ఇవ్వడంతో.

ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెనక్కి తగ్గారు.

అంతేకాకుండా హింసాత్మక ఘటనలకు సంబంధించి ఒకరిపై మరొకరు పెట్టుకున్న కేసుల విషయంలో కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది.అమిత్ షా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇటీవల మాట్లాడిన తరుణంలో… చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలని తెలియజేశారు.హింసాత్మక ఘటనల నేపథ్యంలో కొన్ని రహదారులు నిలిపివేయడంతో మిజోరం లో మెడిసిన్ కొరత ఉన్నట్లు ఆ రాష్ట్ర మంత్రులు తాజాగా కేంద్రం దృష్టికి తీసుకు వచ్చారు.

కొన్ని సంవత్సరాల నుండి సరిహద్దు గొడవ ఇరు రాష్ట్రాల మధ్య ఉండటంతో ఈసారి ఎలాగైనా ఈ సరిహద్దు సమస్యకి శాశ్వత పరిష్కారం చూప్పాలని కేంద్రం డిసైడ్ అయ్యింది.ఈనెల 5వ తారీఖున ఇరు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ఈ విషయంపై చర్చలు జరపనున్నట్లు సమాచారం.

#Assam #Amith Shah #Mizoram #Boarder

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు