ఫైర్‌బ్రాండ్‌పై మేనల్లుడు 'ఫైర్‌'

కొందరు నాయకులకు దగ్గరి బంధువులే తలనొప్పిగా మారుతారు.వారి పరువు తీస్తారు.

 West Bengal Government Had “killed” Maoist Leader Kishenji-TeluguStop.com

ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విషయంలో ఇదే జరిగింది.ఆమె మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ ఆమెకు సరికొత్త తలనొప్పి తెచ్చిపెట్టాడు.

ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న మమతపైనే అతను ఫైర్‌ అయ్యాడు.ఇంతకూ అభిషేక్‌ ఏమన్నాడంటే….

మావోయిస్టు నాయకుడు కిషన్‌జీ ఎన్‌కౌంటర్లో చనిపోలేదని, ప్రభుత్వమే అతన్ని చంపేసిందని ఆరోపించాడు.మమత అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ బలగాల జాయింట్‌ ఆపరేషన్లో కిషన్‌జీ చనిపోయాడు.

ప్రభుత్వం ఇలాగే ప్రచారం చేసింది కాబట్టి జనం కూడా నమ్మారు.కాని అది నిజం కాదని అభిషేక్‌ అంటున్నాడు.

ఇతను తృణమూల్‌ కాంగ్రెసుకు చెందిన పార్లమెంటు సభ్యుడే.మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చాక పశ్చిమ మిడ్నపూర్‌లో ఒకే ఒక్క మావోయిస్టు చనిపోయాడని, అతను కిషన్‌జీయేనని అభిషేక్‌ చెప్పాడు.

కిషన్‌జీని మమతా బెనర్జీ ప్రభుత్వమే చంపిందని, ఇది భవిష్యత్తులో రుజువు అవుతుందని అన్నాడు.మావోయిస్టు పార్టీ నాయకుడు కిషన్‌జీ తెలుగోడేనని సంగతి ఎక్కువ మందికి తెలిసుండదు.

నాలుగేళ్ల క్రితం ఇతను ఎన్‌కౌంటర్లో చనిపోయినట్లు ప్రచారం జరిగింది.ఇతని మరణం తరువాత పశ్చిమ బెంగాల్లో మావోయిస్టు కార్యకలాపాలకు గట్టి దెబ్బ తగిలింది.

అభిషేక్‌ చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏవిధంగా స్పందిస్తారో మరి….!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube