దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీం సీజే ఆసక్తికర వ్యాఖ్యలు  

Supreme Court Chief Justice Sa Bobde Opposed On Encounter-justice For Disha,opposed On Encounter,supreme Court

దిశ నిందితుల ఎన్ కౌంటర్ ని దేశ వ్యాప్తంగా సామాన్య జనం అంగీకరిస్తున్న మేధావులు, ప్రజా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని బూటకపు ఎన్ కౌంటర్ చేయడం సరైన తీర్పు కాదని, ఇలాంటి ఘటనలతో ప్రజలకి న్యాయవ్యవస్థ మీద పూర్తిగా నమ్మకం పోతుందని అంటున్నారు.

Supreme Court Chief Justice Sa Bobde Opposed On Encounter-justice For Disha,opposed On Encounter,supreme Court Telugu Viral News Supreme Court Chief Justice Sa Bobde Opposed On Encounter-justice For D-Supreme Court Chief Justice SA Bobde Opposed On Encounter-Justice For Disha Opposed Encounter

దీనిపై హై కోర్టులో కేసులు కూడా నమోదు అయ్యాయి.న్యాయస్థానం కేసుని విచారణకి ఆదేశించింది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ఘటన మీద సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

ప్రజలు ఆవేశంతో డిమాండ్ చేస్తున్నారని సత్వర న్యాయం చేయడం అనేది సరైన నిర్ణయం కాదని ఆయన వ్యాఖ్యానించారు.

జస్టిస్ అనేది ప్రతీకారం రూపంలో ఉండకూడదన్నారు.అలా జరిగితే న్యాయం రూపు రేఖలు కోల్పోతుందని వ్యాఖ్యానించారు.

కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ రేప్ కేసుల్లో త్వరగా తీర్పులు వెలువడాలన్న భావనను వ్యక్తం చేయగా సీజేఐ అతని వ్యాఖ్యలతో విభేదించారు.ఒక వ్యవస్థగా న్యాయాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతూ, అప్పటికే ఉన్న సంస్థలను మరింత బలపరుస్తూ వేగవంతంగా, సంతృప్తికరంగా వివాదాల్లో రాజీ కుదర్చాలి లేదా పరిష్కారం చూపాలని సీజేఐ వ్యాఖ్యానించారు.

అయితే సీజే చేసిన ఈ వ్యాఖ్యలు అక్కడ సందర్భాన్ని బట్టి అన్నాకూడా అవి కాస్తా దిశ నిందితుల ఎన్ కౌంటర్ ని వ్యతిరేకించే విధంగా ఉండటంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

.

తాజా వార్తలు

Supreme Court Chief Justice Sa Bobde Opposed On Encounter-justice For Disha,opposed On Encounter,supreme Court Related....