ట్రంప్ కే వార్నింగ్ ఇచ్చిన పోలీస్ బాస్..!!!  

Chief Art Acevedo George Floyd Protesters Trump - Telugu Chief Art Acevedo, George Floyd Protesters, Trump

జార్జ్ ఫ్లాయిడ్ హత్య తరువాత జరుగుతున్న నిరసనల అల్లర్లు ఏ మాత్రం ఆగలేదు.రోజు రోజుకి ఈ అల్లర్లు ఉదృతం అవుతున్నాయి.

 Chief Art Acevedo George Floyd Protesters Trump

ఎక్కడా కూడా ప్రశాంత వాతావరం కలిపించిన ఆనవాలు లేవు.కరోనా అలజడిలో సైతం ప్రజలు ఈ విధంగా ముందుకు రావడం అందరిని ఆశ్చర్య పరుస్తోంది.

ఓ పోలీసు అధికారి కాలి కింద అమానుషంగా చంపబడిన నల్లజాతీయుడి ఆకరి మాటలు అందరిలో తెలియని కోపాన్ని మిగిల్చాయి.ఏకంగా వైట్ హౌస్ నే ముట్టడి చేయడానికి ప్రయత్నిచారంటే వారు ఏ స్థాయిలో అమెరికా ప్రభుత్వంపై కోపంతో ఉన్నారో అర్థమవుతోంది.అయితే

ట్రంప్ కే వార్నింగ్ ఇచ్చిన పోలీస్ బాస్..-Telugu NRI-Telugu Tollywood Photo Image

ఈ సమయంలో ఎంతో నైపుణ్యంగా ప్రజలని శాంతింప చేయాల్సిన అవసరం అధ్యక్షుడు ట్రంప్ పై ఉంది.కానీ అధ్యక్షుడి హోదాలో ఉన్న ట్రంప్ మాత్రం వారిపై పరుషమైన వ్యాఖ్యలు చేస్తూ వారి కోపానికి మరింత ఆజ్యం పోస్తున్నారు.

రెండు రోజుల క్రితం లూటీ చేస్తే షూటింగ్ తప్పదు అంటూ నిరసన కారులని హెచ్చరించి పరిస్థితి మరింత చేయి దాటేలా చేశారు.ట్రంప్ వైఖరితో నిరసన కారులు మరింతగా రెచ్చిపోతున్నారు.ఈ క్రమంలోనే

టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగర పోలీస్ బాస్ ఆర్ట్ అసేవేడో ట్రంప్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.నోరు మూసుకుంటే మంచిది ట్రంప్ అన్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.నిరసన కారులని మీ మాటలతో రెచ్చగొడుతున్నారు మీరు మాట్లాడటానికి ఏమి లేక పొతే మాట్లాడకండి.వారిని రెచ్చగొట్టద్దు నోటికి వచ్చినట్టు మాట్లాడే కంటే కూడా శాంతి కోసం మీరు ఏదైనా కార్యాచరణ ప్రకటిస్తే బాగుంటుంది అంటూ మండిపడ్డారు.

ఈ పోలీస్ బాస్ ఏకంగా ట్రంప్ కే వార్నింగ్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయిపోయారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Chief Art Acevedo George Floyd Protesters Trump Related Telugu News,Photos/Pics,Images..

footer-test