ఇంటి భోజనం కావాలని కోరిన చిదంబరం,అంగీకరించిన కోర్టు

కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్న విషయం విదితమే.ఈ క్రమంలో ఆయన జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

 Chidambaram To Get Home Cooked Food-TeluguStop.com

చిదంబరం కస్టడీ పొడిగించాలి అంటూ సీబీఐ విజ్ఞప్తి చేయగా దానికి అంగీకరించైనా న్యాయస్థానం ఈ నెల 17 వరకు ఆయన జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.అయితే ఈ క్రమంలో తనకు ఇంటి భోజనం కావలి అని కోర్టు లో చిదంబరం కోరగా దానికి కోర్టు కూడా అనుమతించింది.

ఆయనకు ఇంటి భోజనం అనుమతించాలి అంటూ జైలు అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది.కానీ ఒక కండీషన్ కూడా విధించింది.

అదేంటంటే రోజుకు రెండు సార్లు ఇంటి భోజనం తినాలని అదికూడా శాఖాహారం మాత్రమే అని కోర్టు స్పష్టం చేసింది.ఈ మేరకు జైలు అధికారులకు కూడా కోర్టు స్పష్టం గా తెలిపింది.

మరోపక్క బెయిల్ కోసం కూడా చిదంబరం సుప్రీంను ఆశ్రయించినట్లు తెలుస్తుంది.

అయితే ప్రస్తుతం దసరా దగ్గర పడుతుండడం తో దసరాకు ముందే తన పిటిషన్ పై విచారణ జరపాలని ఈ సందర్భంగా చిదంబరం కోర్టు కు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

దీనితో ఈ పిటీషన్ పై వేగవంతమైన విచారణకు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ మాత్రమే నిర్ణయం తీసుకోగలరని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసినట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube