మాజీ మంత్రికి ఊరట, 105 రోజుల తరువాత జైలు నుంచి బయటకు

మాజీ కేంద్ర మంత్రి కి సుప్రీం కోర్టు లో ఊరట లభించింది.2017 లో ఐఎన్ ఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరం పై సీబీఐ అవినీతి కేసు తో పాటు మనీలాండరింగ్ కేసు కూడా నమోదు చేసిన విషయం తెలిసిందే.అయితే ఈ కేసుకు సంబంధించి గత ఆగస్టు 21న ఆయనను సీబీఐ అరెస్ట్ చేయగా జ్యుడీషియల్ కస్టడీ విధించారు.

 Chidambaram Supreme-TeluguStop.com

దీనితో అప్పటి నుంచి కూడా ఆయన తీహార్ జైలు లోనే కాలం గడుపుతుండగా మొత్తానికి ఈ కేసు కు సంబంధించి ఆయన కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.దీంతో 105 రోజుల తర్వాత చిదంబరం తీహార్ జైలు నుంచి బయటకు రానున్నారు.

నవంబర్ 15న ఢిల్లీ హైకోర్టు బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చడంతో చిదంబరం సుప్రీంలో దాన్ని సవాల్ చేశారు.అయితే చిదంబరం పెట్టిన పిటీషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ ఆర్.భానుమతి నేత్రుత్వంలోని ధర్మాసనం నవంబర్ 28న తీర్పును రిజర్వ్‌లో పెట్టి తాజాగా బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడం తో ఆయనకు పెద్ద రిలీఫ్ లభించినట్లు అయ్యింది.ఈ పిటీషన్ పై వాదనలు జరిగిన సందర్భంలో చిదంబరం కు బెయిల్ మంజూరు చేస్తే బయటకు వెళ్లి సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గట్టిగా వాదించారు.

Telugu Hidambaram, Supreme-Telugu Political News

అయితే నిరాధార ఆరోపణలతో చిదంబరాన్ని జైల్లో పెట్టాలనుకోవడం సరికాదని ఆయన తరుపున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్,ఏంఎం సింఘ్వీ వాదించడం తో మొత్తానికి సుప్రీం కోర్టు చిదంబరం కు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించింది.దీనితో చిదంబరం తీహార్ జైలు నుంచి బయటకురానున్నారు అన్నమాట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube