జైలు జీవితం వల్ల శారీరకంగా దృఢంగా తయారయ్యా అంటున్న చిదంబరం  

Chidambaram Comments About His Life-congress Leader Chidambaram

ఐఎన్ ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదురుకొంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పి.చిదంబరం బెయిల్ పై విడుదల అయిన విషయం తెలిసిందే.

Chidambaram Comments About His Life-congress Leader Chidambaram Telugu Viral News Chidambaram Comments About His Life-congress Leader-Chidambaram Comments About His Life-Congress Leader

105 రోజులు తీహార్ జైలు లోనే జీవితాన్ని గడిపిన చిదంబరం కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడం తో రిలీఫ్ లభించింది.దీనితో ఆయన పార్లమెంట్ సమావేశాలకు కూడా హాజరవుతున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జైలు జీవితం వల్ల శారీరకంగా దృఢంగా తయారయ్యా అని అంటున్నారు.తీహార్ జైల్లో నన్ను ఉంచిన సెల్ తలుపులు తీసే ఉంచేవారు.

చలి గాలి విపరీతంగా కొట్టేది, స్వేట్టర్లు,ఓవర్ కోట్లు ధరించి జీవించేవాడిని.జైలు జీవితం వల్ల శారీరకంగా దృఢంగా తయారయ్యాను అని, చాలా రోజులు తలగడ లేకుండా నేలపైనే పడుకున్నానని,ఒక్కసారి చెక్క బల్ల పైనే నిద్రించాల్సిన పరిస్థితి వచ్చింది అని తెలిపారు.

శరీరం దృఢంగా తయారైంది, నా మీద.,వెన్నెముక,తల గట్టి పడ్డాయి ముఖ్యంగా నా నడ్డి సాపయ్యింది అని చిదంబరం తెలిపారు.

ఆ స్టు 21న అరెస్ట్‌ అయిన నాటి నుంచి నేటికి 8 కిలోల బరువు తగ్గినట్లు ఆయన పార్టీవాదులకు చెప్పారు.జైలు జీవితం వల్ల తన నైతిక స్థైర్యం ఇనుమడించిందన్నారు.

అలానే నరేంద్ర మోడీ ప్రభుత్వం పై కూడా ఈ సందర్భంగా సెటైర్లు వేశారు.ఈ దేశ ఆర్థిక వ్యవస్థ ఎటువైపు సాగుతోందో తెలియని అగమ్యగోచర స్థితిలో ఉన్నదని చిదంబరం విమర్శించారు.

8, 7, 6.6, 5.8, 5, 4.5 … ఇదీ మన ఆర్థిక దుస్థితి.

ఈ అంకెలు గత ఆరు త్రైమాసికాల్లో మన దేశ ఆర్ధిక వృద్ధిని సూచిస్తున్నాయి.ఈ ఏడాది అంతానికి ఆర్థికాభివృద్ది రేటు 5 శాతం చేరుకుంటే అదృష్టమే అని అంటూ ఆయన వ్యాఖ్యనించారు

.

తాజా వార్తలు