తెలంగాణలో కేవలం 25/- రూపాయలకే కిలో చికెన్...

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా  వైరస్ ఎంతలా కలకలం సృష్టిస్తుందో పెద్దగా చెప్పనవసరం లేదు.ఇప్పటికే ఈ వైరస్ సోకి చైనాలో వందల సంఖ్యలో మరణించగా మరికొంతమంది ఈ వైరస్ బారినపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నట్లు ఇప్పటికే పలు వైద్య గణాంకాలు చెబుతున్నాయి.

 Chicken Shop Owner Selling 1 Kg Chicken Only 25 Rupees In Telangana-TeluguStop.com

అయితే తాజాగా ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ భారతదేశంలో కూడా పడినట్లు తెలుస్తోంది.అంతేగాక ఈ కరోనా  వైరస్ఎఫెక్ట్ వల్ల దాదాపుగా ఇప్పటికే పలు సంస్థలు తమ ఉద్యోగులకు సెలవులు కూడా ఇచ్చారు.

అయితే ఈ కరోనా  వైరస్ ఎఫెక్ట్ పడినటువంటి రంగాల్లో పౌల్ట్రీ ఫారం రంగం కూడా ఒకటి.

అయితే ప్రస్తుతం ఈ కరోనా  వైరస్ ఎఫెక్ట్ హైదరాబాద్ నగరంలోని పలు చికెన్ షాపులపై కూడా పడినట్లు తెలుస్తోంది.

దీంతో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి.దీంతో చికెన్ షాపు యజమానులు తక్కువ రేట్లకే చికెన్ విక్రయించేందుకు నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.

అంతేకాక ఇప్పటికే యాదాద్రి  భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఓ చికెన్ షాప్ యజమాని చికెన్ తినడం వల్ల కరోనా వైరస్ సోకదని తెలియజెప్పేందుకు నాలుగు కేజీల కోడిని కేవలం వంద రూపాయలకే అమ్ముతూ ప్రజలకి అవగాహన కల్పించారు.

Telugu Kg Chicken, Checken Rs, Chicken Rupees, Chicken Shop, Chickenshop, Corona

అయితే ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు మరియు మంత్రులు కూడా చికెన్ తినడం వల్ల కరోనా వైరస్ సొకదని చెప్పినప్పటికీ జనాలు మాత్రం లేనిపోని అపోహలతో చికెన్ తినడం పూర్తిగా మానేశారు.అందువల్లనే దాదాపుగా ఈ నెలలోనే పౌల్ట్రీ ఫారం రంగానికి  వేల కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube