ఆశ్చర్యం: తల లేకుండా 18 నెలలు బతికిన కోడి  

Chicken D With Out Head-laeed Olsen,mike Chicken,telugu Nri News

తల లేని కోడి, నిజంగా ఇలా తల లేకుండా కోడి బతికి బట్టకట్టి ఉంటుందా అని ఆలోచిస్తున్నారా.నిజంగానే 1945 వ సంవత్సరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.ఒక కోడి తల లేకుండా జీవించిందట.వివరాల్లోకి వెళితే….1945 ఏప్రిల్ 20 న మైక్ అనే కోడి పుట్టింది.అయితే సెప్టెంబర్ 10,1945 న కొలరాడో లోని లాయిడ్ ఒల్సెన్ చికెన్ వండుకుందామని 5 నెలల మైక్ ని ఇంటికి తెచ్చుకున్నాడు.ఈ క్రమంలో దానిని చంపడానికి గొడ్డలి తో ఒక వేటు కూడా వేశాడు.

Chicken D With Out Head-laeed Olsen,mike Chicken,telugu Nri News-Chicken Lived With Out Head-Laeed Olsen Mike Telugu Nri News

అయితే దాని తల పూర్తిగా కట్ అవ్వకపోగా,ముఖ్యంగా తలా నుంచి శరీరానికి మెదడు సిగ్నల్స్ పంపించే జగ్లర్ వెయిన్ కట్ అవ్వకపోవడం తో మైక్ లాయిడ్ నుంచి తప్పించుకుని పరుగులు పెట్టింది.

Chicken D With Out Head-laeed Olsen,mike Chicken,telugu Nri News-Chicken Lived With Out Head-Laeed Olsen Mike Telugu Nri News

దీనితో దానిని పట్టుకోవాలని లాయిడ్ ప్రయత్నించినప్పటికీ అది చిక్కకపోవడం అలానే దాని అరుపులు కూడా విన్న తరువాత లాయిడ్ తన నిర్ణయాన్ని మార్చుకొని దానిని బతికించాలని భావించాడు.దీనితో ఓ చెవి, చాలావరకూ మెదడు కూడా కోడి మెడతోపాటే ఉండిపోవడం తో కళ్లలో చుక్కలు వేసేందుకు ఉపయోగించే ఐ డ్రాపర్‌తో కోడి మెడలోకి పాలు, నీళ్లూ పోశాడు.

అదే విధంగా… చిరు ధాన్యాలు, మొక్కజొన్న, చిన్న చిన్న పురుగుల్ని కూడా ఓ సిరంజి గొట్టం ద్వారా మెడలోంచీ పొట్టలోనికి పోనిచ్చాడు.దీనితో కోడి కూడా బతకడం తో ఈ విషయం మొత్తం మెల్లమెల్లాగా ఊరంతా తెలిసింది.అప్పట్లో ఈ విషయం తెలుసుకున్నవారంతా అబద్ధమని కొట్టిపా రేసినప్పటికీ ఆ తరువాత విషయం తెలుసుకొని మైక్ ని చూడడానికి తండోప తండాలు గా వచ్చేవారట.

డజన్ల కొద్దీ మేగజైన్లూ, పేపర్లూ ఈ విషయాన్ని ప్రచురించాయి.తలలేని మైక్‌ని చూపించాలంటే… 25 సెంట్లు (ఇప్పుడైతే రూ.15) ఇవ్వాలని లాయిడ్ ఒక కండీషన్ కూడా పెట్టాడు.

అయినప్పటికీ జనాలు మాత్రం తగ్గకుండా మైక్ ని చూడడానికి వచ్చేవారట.అలా లాయిడ్ నెలకు $4,500 (రూ.3,19,659) (ఇప్పటి లెక్కల ప్రకారం రూ.35,87,284) సంపాదించేవాడు.ఫలితంగా మైక్ విలువ అప్పట్లో $10,000 (రూ.7,10,353) పలికింది.చివరికి ఆ కోడి 18 నెలలు అలానే తల లేకుండా బతికినట్లు తెలుస్తుంది.