వావ్: కారు పొగ గొట్టంలో కబాబ్ తయారీ.. చివరికి..?

ఈ మధ్య కాలం సోషల్ మీడియాలో కొన్ని వీడియోల ద్వారా చాలా మంది పాపులర్ అవుతున్నారు.సోషల్ మీడియా అంటే కొందరికి వ్యసనంలా మారిపోతోంది.

 Man, Tries, Kebab, Lamborghini, Exhaust, Viral Video, Viral News, Social Media-TeluguStop.com

ఎక్కువ లైకులు, కామెంట్లు తెప్పించుకోవడం కోసం విచిత్రమైన వీడియోలు చేసి నెట్టింట్లో వదలడం సాధారణమైపోయింది.ఆ వీడియో చేయడం వల్ల లాభమేమీ ఉండదు.

అయినప్పటికీ చాలా మంది తమ అతి తెలివితేటలను ఉపయోగిస్తూ వీడియోలు చేసి వదులుతున్నారు.కొందరు ఫేమస్ అవుతుంటే మరికొందరు తమ ప్లాన్లను అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ముఖం చాటేస్తున్నారు.

తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.

సాధారణంగా చికెన్ ను పొయ్యి మీదనో లేక నిప్పులపైనో వండుతారు.అయితే ఇక్కడ మాత్రం కొందరు కుర్రాళ్లు కారు పొగతో చికెన్ వండాలనుకున్నారు.చైనా హునాన్ ప్రావిన్సులోని ఓ కారు గ్యారేజీలో కొందరు వ్యక్తులు డిఫరెంట్ గా చికెన్ వండాలనుకున్నారు.

అందుకోసం వారు లంబోర్గినీ ఎగ్జాస్ట్ మంటతో చికెన్ కబాబ్ చేయాలనుకున్నారు.ఓ వ్యక్తి లంబోర్గినీ కారు ఎగ్జాస్ట్ దగ్గర చేతిలో స్క్యూవర్‌తో దానికి చికెన్ ముక్కులను గుచ్చాడు.

ఆ తర్వాత ఇంకో వ్యక్తి కారు ఎక్కి ఇంజిన్ ను స్టార్ట్ చేశాడు.ఆ తర్వాత కారును బాగా రైజ్ చేయసాగాడు.అయితే ఆ తర్వాత వారి ప్లాన్ బెడిసికొట్టింది.కారు నుంచి మంటలు రావడంతో వారు అక్కడి నుంచి బయటకు వచ్చశారు.

కారులో ఎరుపు రంగులోని కూలంట్ ద్రవం ఒక్కసారిగా లీక్ అయిపోయింది.కారు నుంచి అలా మంటలతో కూడిన పొగలు రావడంతో అందరూ భయపడిపోయారు.

ఆ తర్వాత ఆ పొగ తగ్గడంతో ఊపిరి పీల్చుకున్నారు.మంటల వల్ల కారులోని ప్లాస్టిక్ కూలంట్ ట్యాంక్ బద్దలైపోయింది.

ఆ తర్వాత లిక్విడ్ లీకైందని ఆటోమొబైల్ ఎక్స్‌పర్ట్స్ చెప్పడంతో వారు రిపేరు పనుల్లో పడ్డారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube