అమెరికాలలో రోడ్డెక్కిన గురువులు

అమెరికాలో టీచర్స్ అందరూ రోడ్డెక్కారు.తమకి పని భారం తీవ్రమవుతోందని, ఇద్దరు చేయాల్సిన పనిని ఒక్కరితోనే చేయిస్తున్నారని, క్లాసుల్లో విద్యార్ధుల సంఖ్య కుదించాలని ఇలా రకరకాల డిమాండ్లు చేస్తూ ప్రభుత్వ స్కూల్ టీచర్లు సమ్మె బాట పట్టారు.

 Chicago Teachers Held A Major Rally-TeluguStop.com

చికాగోలో జరిగిన ఈ సమ్మె ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా విసృతం అవుతోంది.స్కూల్స్ లో ఉన్న లైబ్రేరియన్ నర్స్ ల సామాజిక కార్యకర్తలు ఇతర సిబ్బందిని నియమించాలని, తమకి పని భారం తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.

స్కూల్స్ ని కూడా అభివృద్ధి చేయాలని , పిల్లల కుదింపు లేకపోతె ఆ ప్రభావం చదువుకునే ఆ పిల్లలపైనే పడుతుందని తెలిపారు.అయితే చాలా ఏళ్ళ తరువాత డెమోక్రటిక్ పార్టీ విద్యా వ్యవస్థపై పోరు బాట పట్టడం ఇప్పుడు సర్వాత్రా చర్చనీయంసం అవుతోంది.

గతంలో అంటే 2012 తరువాత టీచర్స్ చేపట్టిన ఉద్యమం తరువాత ఇంతటి భారీ స్థాయిలో ఉద్యమం చేపట్టడం ఇది రెండవ సారని అంటున్నారు.

Telugu Class Sizes, Raises, Staff-

 

ఈ ఏడాది మొదలు నుంచీ అమెరికాలోని వివిధ రాష్ట్రాలలో ఉన్నటీచర్స్ అందరూ సమ్మె బాట పట్టారు.ఇప్పటి వరకూ సుమారు 70 వేల మంది టీచర్స్ రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారని టీచర్స్ సంఘాలు అంటున్నాయి.అయితే వీరికి మద్దతుగా అమెరికాలో వివిధ యూనివర్సిటీల అధ్యాపకులు , పలు టీచర్స్ కూడా సమ్మెలో పాల్గొననున్నారని తెలుస్తోంది.

అయితే ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ డెమోక్రటిక్ పార్టీ చేస్తున్న జిమ్మిక్కులు ఇవి అంటూ కొట్టిపారేస్తున్నారు రిపబ్లికన్ పార్టీ నేతలు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube