అమెరికాలో దారుణం : భారత సంతతి విద్యార్ధిని అనుమానాస్పద మృతి..!!!  

chicago surel dabawala car ashraf - Telugu Car, Chicago, Found Dead In Car, Shraf, Surel Dabawala, అమెరికన్ మహిళ

అమెరికాలో భారత సంతతి విద్యార్ధుల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి.రెండు రోజుల క్రితం వివేక్ సుబ్రమణియన్ అనే వైద్య విద్యార్ధి మృతి ఘటన నుంచీ ఇంకా తేరుకోక ముందే మరో భారత సంతతి విద్యార్ధిని మృతి తీవ్ర విషాదాన్ని నింపింది.

TeluguStop.com - Chicago Surel Dabawala Car Ashraf

గడిచిన నెల రోజులుగా కనపడకుండా పోయిన ఆమె ఒక్క సారిగా శవమై కనిపించడంతో ఆమె తల్లి తండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.వివరాలలోకి వెళ్తే.

అమెరికాలో స్థిరపడిన ఓ భారతీయ ఎన్నారై కుటుంభానికి చెందిన ఆమె పేరు సురీల్ దాబావాలా.ఆమె తండ్రి, తల్లీ ఇద్దరూ అమెరికాలో ప్రముఖ డాక్టర్లు పనిచేస్తున్నారు.మృతి చెందిన సురీల్ వీరికి ఒక్కగానొక్క కూతురు.సురీల్ గతంలో చిగాగోలోని ఓ యూనివర్సిటీ లో ఎంబీయే పూర్తిచేశారు.

ఎప్పుడూ సరదాగా ఉండే సురీల్ గత నెల డిసెంబర్ న కనిపించకుండా పోయింది.దాంతో

తమ కుమార్తె కనిపించడంలేదంటూ తండ్రి మరుసటి రోజు పోలీసులకి ఫిర్యాదు చేశారు.ఆ రోజు నుంచీ ఫిర్యాదులో భాగంగా విచారణ చేపట్టిన పోలీసులకి చికాగో సమీపంలోని వెస్ట్ గార్ ఫీల్డ్ పార్క్ సమీపంలో సురీల్ ఓ కారు డిక్కీలో దుప్పట్లో చుట్టి మృతి చెంది ఉండటం గమనించారు.అయితే ఆమె మరణానికి గల కారణాలు ప్రస్తుతానికి తెలియకపోయినా కొందరు అనుమానితులని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

#Shraf #Chicago #Surel Dabawala

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు