కరోనా ఎఫెక్ట్ : అమెరికాలో తెలుగువారికి తెలుగు మహిళ సాయం...

అమెరికాలో కరోనా ప్రభావం ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.ఎక్కడ కరోనా సోకుంతుందోనని భారతీయులు బయటకి కూడా రాలేని పరిస్థితి నెలకొంది.

 Chicago Indian Community Kindness-TeluguStop.com

అమెరికా వ్యాప్తంగా సుమారు 200మంది కరోనా మృతి కేసులు నమోదు కావడంతో పాటు సుమారు 14 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఒక్క సారిగా అందరూ బిక్క బిగుసుకుపోయారు.బయటకి వెళ్ళాలన్నా కరోనా భయం, ఏదన్నా కొనుక్కుని తినాలన్నా కరోనా సోకుంతుందోమో ననే భయం తెలుగువారిని వెంటాడుతోంది

ఈ పరిస్తితులల్లో అమెరికాలోని తెలుగువారు ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు బయటకి రాలేక నిత్యావసర వస్తువులు తెచ్చుకోలేక పలు ఇబ్బందులు పడుతున్నారు.

ఈ పరిస్థితిని గమనించిన తెలుగు కమ్యునిటీకి చెందిన శ్రీమతి చాందిని దువ్వూరి మరి కొందరు తెలుగు వారితో కలిసి ముందుకు వచ్చారు.

కరోనా మహమ్మారిని లెక్క చేయకుండా వారందరూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఒక వాలంటరీ కమిటీగా ఏర్పడి తెలుగు వారందరికీ అవసరమైన సాయం అందిస్తున్నారు.

చికాగో ఇండియన్ కమ్యునిటీ తరుపున వీరు సాయాన్ని అందిస్తున్నారు.అయితే ఈ కమిటీలో వాలంటీర్లుగా పనిచేయడానికి ఆసక్తి ఉన్నవారు ముందుకు రావాలని చాందిని కోరుతున్నారు.చాందిని చేస్తున్న సేవలని పలువురు తెలుగు ఎన్నారైలు కొనియాడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube