పాత్రలో కుర్చోబెట్టి గర్భిణీని నది దాటించారు, చివరికి!?

కొన్ని ఘటనలు చూస్తే కన్నీళ్లు వస్తాయి.ఆతర్వాత అనిపిస్తుంది.

 Pregnant Woman, Utensil, River, Hospital, Chhattisgarh, Chhattisgarh Pregnant Wo-TeluguStop.com

అలాంటి ఘటనలు చోటు చేసుకోవడానికి కారణం ఆ ప్రజలే కదా! అని.అవును.మరు మూలా గ్రామాల్లో రోడ్డు సరిగ్గా లేదన్న.గ్రామంలో మంచి నీటి సమస్య ఉందన్న.పాఠశాలలు లేవన్న ఆస్పత్రులు లేవన్న దీనికి కారణం ప్రజలే.

రెండు వేల నోటుకు, సారా సీసాకు ఆశపడి ఓటు వేసిన ప్రజలకు ఈ సమస్యలు కాకా మరేం ఉంటాయి.

దీనికి కారణం ప్రజలే.ఇంకా ఇప్పుడు కూడా ఒక గర్భిణీకి జరిగిన ఘటన గురించి తెలిస్తే కన్నీళ్లు వస్తాయి.

పాపం అనిపిస్తుంది.ఆ ఘటన చత్తీస్‌గడ్‌లో చోటుచేసుకుంది.

బీజాపూర్ జిల్లాలోని గోర్ల గ్రామానికి చెందిన లక్ష్మీ యాలం అనే ఓ గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి.

Telugu Chhattisgarh, Pregnant, River, Utensil-General-Telugu

దీంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాలనుకున్నారు.అయితే ఆస్పత్రికి వెళ్ళాలి అంటే మార్గం మధ్యలో చింతవాగు నదిని దాటాలి.అక్కడ వంతెన లేదు.

దింతో ఆమెను మోసుకుంటూ నది దాటాలి.పెద్ద పాత్రకు అటూ ఇటూ కర్రలు కట్టారు.

అనంతరం ఆమెను ఆ పాత్రలో కుర్చోబెట్టి నది దాటించారు.అనంతరం 15 కిమీల దూరంలోని భోపాలపట్నం కమ్యునిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు.

ఇంత చేసిన సరే ఎలాంటి ప్రయోజనం లేకపోగా విషాదం మిగిలింది.ఆ ఆస్పత్రిలో సమయానికి నర్సు, డాక్టర్ లేరు.డాక్టర్ కు ఫోన్ చేసిన ఆలస్యంగా వచ్చాడు.దీంతో బిడ్డ కడుపులోనే చనిపోయింది.

చివరికి మృత శిశువుకు జన్మనిచ్చింది.దీంతో ఘటనపై అధికారులు ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు.

ఇప్పుడు ఏ విచారణ జరిపితే ఎం ప్రయోజనం? జరగాల్సిన నష్టం జరిగిపోయింది.మృతి చెందిన శిశువుకు జన్మనిచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube