ఖాకీ చొక్కా వేసిన ట్రాన్స్ జెండర్.. కారణం అదే..!

మన దేశంలో ట్రాన్స్ జెండర్ లను చులకనగా చూసేవారు.కానీ ఇప్పుడిప్పుడే సమాజంలో మార్పు వస్తుంది.

 Chhattisgarh Police Department Recruit 13 Transgender Constables, Chhattisgarh,-TeluguStop.com

వాళ్ళను కూడా గుర్తించడం మొదలు పెట్టారు.ఈ మధ్య సమాజంలో ఉండే వారు ఏమనుకుంటున్నారో అని భయపడడం లేదు.వాళ్లకు నచ్చినట్లు జెండర్ మార్చుకుని స్వేచ్ఛగా జీవిస్తున్నారు.2014 లోనే కోర్టు ట్రాన్స్ జెండర్స్ ను థర్డ్ జెండర్ గా గుర్తించి సమాజంలో మిగతా వారితో పాటు వీరికి కూడా సమాన హక్కులు ఉండాలని సూచించింది.

అందుకే స్ర్తీ, పురుషులతో పాటు వీరికి కూడా సమాన గౌరవాలు దక్కుతాయి.వీరికి కూడా ఆధార్, పాన్ కార్డులు లభిస్తున్నాయి.అంతేకాదు రైల్వే టికెట్ లో కూడా వీరికి 40 శాతం రాయితీ కల్పిస్తున్నారు. ఛత్తీస్ గఢ్ పోలీస్ శాఖలో రిక్రూట్ మెంట్ జరుగుతున్నా నేపథ్యంలో ట్రాన్స్ జెండర్ కు కూడా అవకాశం కల్పించడంతో ట్రాన్స్ జెండర్స్ భారీగా పోటీపడుతున్నారు.

అంతేకాదు 2019-20 మధ్య కాలంలో కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ ఎగ్జామ్ జరగగా అందులో ట్రాన్స్ జెండర్స్ 13 మందికి ఉద్యోగాలు దక్కాయి.దీంతో ట్రాన్స్ జెండర్స్ ఏమి చేయలేరని భావించే వాళ్లకు ఒక గుణపాఠంగా చెబుతున్నారు.

ఇప్పటి వరకు మన దేశంలో ఇద్దరు ట్రాన్స్ జెండర్స్ తమిళనాడులో ఒకరు, రాజస్థాన్ లో ఒకరు మాత్రమే పోలీసులుగా విధులు నిర్వహిస్తున్నారు.

Telugu Bihar, Chattisgarh, Chhattisgarh, Constables, Transgender-Latest News - T

అయితే ఇప్పుడు ఛత్తీస్ ఘడ్ లో ఒకేసారి 13 మంది థర్డ్ జెండర్స్ కు ఒకేసారి ఇలా ఖాకీ చొక్కా వేసుకునే అవకాశం రావడం వల్ల ఇప్పుడు ఈ విషయంపై చర్చ జరుగుతుంది.అయితే ఈ విషయంపై ట్రాన్స్ జెండర్స్ స్పందిస్తూ ఈ జాబ్ సంపాదించడానికి తాము చాలా కష్టపడ్డామని ఎట్టకేలకు ఈ ఉద్యోగం సంపాదించడం చాలా ఆనందంగా ఉందని వారు చెబుతున్నారు.అయితే ఛత్తీస్ ఘడ్ స్పూర్తితో బీహార్ కూడా సిద్దమవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube