విశాఖ తరహాలో ఛతీస్‌గఢ్‌ పేపర్‌ మిల్లులో గ్యాస్‌ లీక్‌

నిన్న విశాఖపట్నంలో గ్యాస్‌ లీక్‌ అయ్యి 11 మంది మృతి చెందడటంతో పాటు వందల మంది తీవ్ర అనారోగ్యం పాలయ్యారు.దేశ వ్యాప్తంగా ఈ విషయమై చర్చ జరిగింది.

 Chhattisgarh Papper Mill Gas Leak Vishakapatanam, Chhattisgarh, Papper Mill, Gas-TeluguStop.com

ప్రధాని నరేంద్ర మోడీ కూడా తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ పరిస్థితిని సమీక్షించారు.విశాఖ గ్యాస్‌ లీకేజ్‌ను దేశం మరవక ముందే మరో సంఘటన ఇలాంటిదే జరిగింది.

అయితే ఈసారి ఛతీస్‌ గడ్‌లోని పేపర్‌ మిల్లులో గ్యాస్‌ లీకేజీ జరిగింది. గ్యాస్‌ లీకేజీకి సంబందించిన విషయం దేశ వ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశం అయ్యింది.

అయితే అదృష్టవశాత్తు అక్కడ ఎవరు మృతి చెందక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

రాయ్‌గఢ్‌లోని పేపర్‌ మిల్లులో ఒక ట్యాంక్‌ను క్లీన్‌ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు గ్యాస్‌ లీకేజీ జరిగిందట.

ఆ సమయంలో మిల్లులో పని చేస్తున్న ఏడుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు.ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని స్థానికులు అంటున్నారు.రెస్య్కూ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి గ్యాస్‌ను అదుపులోకి తీసుకు రావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు అంటున్నారు.ఈ సంఘటనలో ప్రాణాలు ఎవరివి పోలేదని, గ్యాస్‌ ప్రభావం తక్కువగా ఉండటం వల్ల వెంటనే సిబ్బంది అదుపులోకి తీసుకు రావడంలో సఫలం అయ్యారని స్థానికులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube