బీఆర్ఎస్ పార్టీలోకి మరో మాజీ ముఖ్యమంత్రి..?

దేశంలో లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫొకస్ పెట్టారు.

 Chhattisgarh Janata Congress President Amit Jogi Meets Cm Kcr,amit Jogi,cm Kcr,b-TeluguStop.com

పార్టీ పేరు మార్చిన దగ్గరి నుంచి వడివడిగా అడుగులు వేస్తున్నారు.దేశంలోని అన్ని గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తామని భీష్మించుకు కూర్చున్నారు.

ఇందులో భాగంగా మొదట దక్షిణాదిపై ఫోకస్ చేశారు.తనకు సెంటిమెంట్ అయిన ఆంద్రాతోనే జాతీయ రాజకీయాలకు శ్రీకారం చుట్టారు.

ఏపీలోని మాజీ నేతల్ని రప్పించి కండువాలు కప్పేశారు.

Telugu Ajit Jogi, Amit Jogi, Brs, Chhattisgarh, Cm Kcr, Odishacm, National, Shis

తర్వాత మెల్లిగా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి వాఘేలా, ఒరిసా మాజీ ముఖ్యమంత్రి గిరధర్ గమాంగ్, ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్, అనంతరం మహారాష్ట్రాలో శివాజీ వంశం నేతలను పిలిచి కండువాలు కప్పేశారు.బీఆర్ఎస్ పార్టీకి అంత సీన్ లేదు అనుకునే నేతలందరి నోళ్లు కేసీఆర్ మూయించారు.ఇక అక్కడితో ఆగకుండా కార్యాచరణ కూడా స్టార్ట చేశారు.

జాతీయ స్థాయిలో రైతుల కోసం పనిచేస్తున్న టికాయత్ ను సైతం పిలిపించి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పడానికి ప్లాన్ చేస్తున్నారు.

Telugu Ajit Jogi, Amit Jogi, Brs, Chhattisgarh, Cm Kcr, Odishacm, National, Shis

అంతలోనే కేసీఆర్ కు మరో బంపర్ ఆఫర్ తగిలింది.వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు.చత్తీస్ ఘడ్ నుంచి మరో మాజీ ముఖ్యమంత్రి తనయుడు బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

పార్టీలో చేరికల విషయమై.ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి అజిత్‌జోగి తనయుడు, జనతా కాంగ్రెస్‌ అధ్యక్షుడు అమిత్‌జోగి సీఎం కేసీఆర్‌తో భేటీ అయినట్టు తెలుస్తోంది.

పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ప్రగతి భవన్‌కు వచ్చిన ఆయన తెలంగాణ అభివృద్ధి, దేశ రాజకీయ పరిణామాలు, జాతీయ వ్యవహారాలపై సుదీర్ఘంగా చర్చించారు.బీఆర్ఎస్ పార్టీ విధి విధానాలను కేసీఆర్‌ను అడిగి తెలుసుకున్నారు.

జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తుల అవసరం ఉందని అభిప్రాయపడినట్టు తెలుస్తోంది.చత్తీస్ ఘడ్ లో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న నేత బీఆర్ఎస్ తీర్థం తీసుకుంటే.

అక్కడ స్థానికంగా అది కేసీఆర్ పార్టీకి కలసి వచ్చే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube