బీఅర్ఎస్ లోకి ఛత్రపతి వారసుడు..? కేసీఆర్ మంతనాలు సక్సేస్ అయ్యేనా ..?

సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని స్థాపించిన దగ్గరి నుంచి వడివడిగా అడుగులు వేస్తున్నారు.ఆంధ్రప్రధేశ్ లో పార్టీని స్థాపించారు.

తోటా చంద్రశేఖర్ ను అధ్యక్షుడిని చేసి పగ్గాలు అందించారు.ఇక ప్రతీ రాష్ట్రంలోనూ రైతు వింగ్ లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు.

గుజరాత్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, యూపీ, బీహార్ లాంటి చోట్ల టికాయత్ లాంటి రైతు నాయకులకు పార్టీ పగ్గాలు అప్పగించాలని చూస్తున్నారు.హైదరాబాద్ వేదికగా ఆయా రాష్ట్రాల రైతు నేతలతో సీఎం కేసీఆర్ మంతనాలు జరిపారు.

పార్టీ పగ్గాలతో పాటు రైతు వింగ్ లకు అధ్యక్షులను నియమించనున్నారు.ప్రతి రాష్ట్రంలోనూ.

Advertisement

మాజీ ముఖ్యమంత్రులను సీఎం కేసీఆర్ టార్గెట్ చేశారు.గుజరాత్ లోని వాఘేలాను పార్టీలోకి తీసుకుని.

పార్టీని అక్కడ గ్రామస్థాయిలోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు.ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉండగానే.

ఒడిశాలో మరో ఆఫర్ వచ్చింది.మాజీ ముఖ్యమంత్రి గిరిరాజ్ గమాంగ్, ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్ లు బీజేపీకి షాక్ ఇచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటికే ఈ నేతలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో మంతనాలు జరుపుతూ ఉన్నారు.

పుష్ప2 హిట్టైనా నోరు మెదపని టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఇంత కుళ్లు ఎందుకు?
వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !

ఇవన్నీ ఒక ఎత్తు అయితే.దేశంలోని అతిపెద్ద రాష్ట్రాలలో ఒకటైన మహారాష్ట్రాపై సీఎం కేసీఆర్ కన్నుపడింది.దాంతో ఆ రాష్ట్రంలోనూ మంచి పలుకుబడి ఉన్న నేత కోసం వెతుకుతూ ఉండగా.

Advertisement

శివాజీ సంతతే కేసీఆర్ కు దొరికింది.దాంతో శివాజీ వారసుడైన శంబాజీ రాజాతో మంతనాలు మొదలు పెట్టారు.

ఆయనతో కూడా మంతనాలు దాదాపు ఫైనల్ అయినట్టు తెలుస్తోంది.ఇవాళ రేపట్లో ఆయన్ను కూడా పార్టీలోకి తీసుకుని.

పని ప్రారంభించాలని కేసీఆర్ భావిస్తూ ఉన్నారు.ప్రతి రాష్ట్రంలోనూ నేతలను ఏరికోరి తెచ్చుకుంటూ ఉన్నారు.

ఇక మహారాష్ట్రాలోనూ పార్టీని బలోపేతం చేయడానికి.ఫిబ్రవరి 5న నాందేడ్ లో భారీ సభను ఏర్పాటు చేయనున్నారు.

ఈ సభలో శంబాజీ రాజేకు కండువా కప్పాలని చూస్తున్నారు.గిరిరాజ్ గమాంగ్ ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్ కు కూడా ఇక్కడే కండువాలు కప్పే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.

నాందేడ్ సభను విజయవంతం చేసేందుకు.తెలంగాణా సరిహద్దు జిల్లాల నేతలకు సీఎం కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు.మరి కేసీఆర్ అనుకున్నట్టు జాతీయ స్థాయిలో ఆ పార్టీ నిలబడుతుందా .? లేదా అనేది ఎన్నికలు వస్తే గానీ చెప్పలేమని విశ్లేషకులు చెబుతున్నారు.

తాజా వార్తలు