వక్కపొడి తినటం వలన కలిగే ఆరోగ్య సమస్యలు   Chewing Betel Nut Side Effects     2018-07-22   10:03:46  IST  Ramesh P

చాలా మంది వక్కపొడిని భోజనం అయ్యాక నములుతూ ఉంటారు. కొంత మంది పాన్ రూపంలో తింటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో పాన్ తినే వారి సంఖ్య చాలా ఎక్కువగా పెరిగింది. పాన్ లో సున్నం, తమలపాకు, యాలకులు, దాల్చినచెక్క వంటివి ఉపయోగించిన వక్కపొడి ప్రముఖమైన పాత్రను పోషిస్తుంది. వక్కపొడిని ఎక్కువగా నమలటం వలన కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి.

వక్కపొడి ఎక్కువగా నమలడం వలన నోటి క్యాన్సర్ వస్తుంది. అంతేకాక ఓరల్ సబ్ మ్యూకస్ ఫైబ్రోసిస్ అనే సమస్య వస్తుంది. ఈ సమస్య కారణంగా జా మూవ్ మెంట్ తగ్గిపోతుంది.

వక్కపొడిని ఎక్కువగా నమలటం వలన గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మెటబాలిక్ సిండ్రోమ్ కు గురి అయ్యి తద్వారా ఊబకాయం సమస్యకు గురవడానికి బలమైన బంధం ఉందని ఇటీవల పరిశోధనల్లో తేలింది.

వక్కపొడిని నమలటం వలన గమ్ ఇరిటేషన్ తో పాటు టూత్ డీకే వంటి దంత సమస్యలు వస్తాయి. అంతేకాక రెగ్యులర్ గా వక్కపొడిని నమిలితే దంతాలు ఎరుపు రంగులోకి శాశ్వతంగా మారిపోతాయి.

వక్కపొడిని తరచూ తీసుకోవడం వలన అడిక్షన్ కు గురయ్యే ప్రమాదం ఉంది. వక్కపొడి అలవాటును మానటం చాలా కష్టం అయ్యిపోతుంది. వక్కపొడిని నమలడం ఆరోగ్యకరం కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి వక్కపొడి అలవాటు ఉన్నవారు మానేస్తే చాలా మంచిది. ఏదైనా మితంగా తింటే ఆరోగ్యానికి మంచిది. అదే మితిమీరితే మాత్రం ప్రమాదం.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.