బజాజ్‌ చేతక్‌ మళ్లీ వచ్చేస్తోందోచ్‌

మీరు 30 నుండి 50 ఏళ్ల మద్య వయస్కుల వారు అయితే మీకు ఖచ్చితంగా బజాజ్‌ చేతక్‌ గురించి తెలిసి ఉంటారు.మీలో చాలా మంది ఆ బండిని తోలి ఉంటారు.

 Chetack Comes In Market-TeluguStop.com

ప్రస్తుతం ఆటోకు ఉన్నట్లుగా గేర్లు ఎక్సలేటర్‌ ఉండేది.అలాంటి బండి కాల క్రమేనా కాలగమనంలో కలిసి పోయింది.

అయితే ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అన్నట్లుగా మళ్లీ పాతవాటిని పున: సృష్టి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.అందుకోసం బజాజ్‌ చేతక్‌ను కూడా కొత్తగా తీసుకు రావాలని బజాజ్‌ కంపెనీ నిర్ణయించుకుంది.

అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా జరిగాయి.

బజాజ్‌ చేతక్‌ను ఈసారి కాస్త మార్చి పెట్రోల్‌ వర్షన్‌ కాకుండా చార్జింగ్‌ వర్షన్‌తో తీసుకు రావాలని నిర్ణయించారు.

మహారాష్ట్రలోని చకన్‌ యూనిట్‌లో ఈ బ్యాటరీ బండ్లు తయారు అవుతున్నాయి.ఈ యూనిట్‌లో టెక్నీషియన్స్‌ నుండి అధికారుల వరకు అంతా కూడా మహిళలే ఉంటారనే విషయం తెల్సిందే.

మహిళలు మహిళల కోసం ఈ కొత్త బజాజ్‌ చేతక్‌ను తయారు చేశారు.త్వరలోనే ఇది మార్కెట్‌లోకి రాబోతుందని, తప్పకుండా ఇది ఒక మంచి బండి అవుతుందని అంతా నమ్మకంగా చెబుతున్నారు.

దీనికి అమర్చిన లూథియం అయాన్‌ బ్యాటరీ 70 వేల కిలోమీటర్ల వరకు పని చేస్తుందని చెబుతున్నారు.ఈ బైక్‌ కోసం జనాలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

భారీ ఎత్తున పెట్రోలు రేట్లు పెరిగిన కారణంగా ఇది మంచిగా పని చేస్తుందని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube