బజాజ్‌ చేతక్‌ మళ్లీ వచ్చేస్తోందోచ్‌  

Bajaj Chetack Comes In Market-bajaj Company,batterie Bikes,chetack New Model Version Running With Charging,old Model Chetack Comes In New Look

మీరు 30 నుండి 50 ఏళ్ల మద్య వయస్కుల వారు అయితే మీకు ఖచ్చితంగా బజాజ్‌ చేతక్‌ గురించి తెలిసి ఉంటారు.మీలో చాలా మంది ఆ బండిని తోలి ఉంటారు.ప్రస్తుతం ఆటోకు ఉన్నట్లుగా గేర్లు ఎక్సలేటర్‌ ఉండేది.అలాంటి బండి కాల క్రమేనా కాలగమనంలో కలిసి పోయింది.

Bajaj Chetack Comes In Market-bajaj Company,batterie Bikes,chetack New Model Version Running With Charging,old Model Chetack Comes In New Look Telugu Viral News-Bajaj Chetack Comes In Market-Bajaj Company Batterie Bikes Chetack New Model Version Running With Charging Old Look

అయితే ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అన్నట్లుగా మళ్లీ పాతవాటిని పున: సృష్టి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.అందుకోసం బజాజ్‌ చేతక్‌ను కూడా కొత్తగా తీసుకు రావాలని బజాజ్‌ కంపెనీ నిర్ణయించుకుంది.అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా జరిగాయి.

బజాజ్‌ చేతక్‌ను ఈసారి కాస్త మార్చి పెట్రోల్‌ వర్షన్‌ కాకుండా చార్జింగ్‌ వర్షన్‌తో తీసుకు రావాలని నిర్ణయించారు.

మహారాష్ట్రలోని చకన్‌ యూనిట్‌లో ఈ బ్యాటరీ బండ్లు తయారు అవుతున్నాయి.ఈ యూనిట్‌లో టెక్నీషియన్స్‌ నుండి అధికారుల వరకు అంతా కూడా మహిళలే ఉంటారనే విషయం తెల్సిందే.మహిళలు మహిళల కోసం ఈ కొత్త బజాజ్‌ చేతక్‌ను తయారు చేశారు.త్వరలోనే ఇది మార్కెట్‌లోకి రాబోతుందని, తప్పకుండా ఇది ఒక మంచి బండి అవుతుందని అంతా నమ్మకంగా చెబుతున్నారు.

దీనికి అమర్చిన లూథియం అయాన్‌ బ్యాటరీ 70 వేల కిలోమీటర్ల వరకు పని చేస్తుందని చెబుతున్నారు.ఈ బైక్‌ కోసం జనాలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.భారీ ఎత్తున పెట్రోలు రేట్లు పెరిగిన కారణంగా ఇది మంచిగా పని చేస్తుందని అంటున్నారు.