కరోనా లక్షణాలలో చెస్ట్‌ పెయిన్‌ కూడా ఒక్కటా..?

దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది.కరోనా సెకండ వేవ్ వల్ల చాలా మంది ప్రాణాలను పోగొట్టుకోవడం భయాందోళనకు గురిచేస్తోంది.

 Chest Pain Is Also A Symptom Of Corona-TeluguStop.com

ఇటువంటి సమయంలో ఏ జబ్బు చేసినా కరోనా లక్షణమేనని చాలా మంది బాధపడుతున్నారు.కరోనా లక్షణాల వల్ల చాలా మందిలో అలజడి కలుగుతోంది.

​ప్రతిరోజూ వివిధ లక్షణాలతో వైరస్‌ బారిన పడుతున్నవారు చాలా మందే ఉన్నారు.సాధారణంగా అయితే పొడిదగ్గు, నీరసం, వాసన కోల్పోవడం వంటివి కరోనా లక్షణాలుగా డబ్ల్యుహెచ్ఓ తెలిపింది.

 Chest Pain Is Also A Symptom Of Corona-కరోనా లక్షణాలలో చెస్ట్‌ పెయిన్‌ కూడా ఒక్కటా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే, ఇటీవల చెస్ట్‌ పెయిన్‌ కూడా కొవిడ్‌ లక్షణమేనని వైద్యులు ధ్రువీకరించారు.దీన్ని కొంత మంది బాధితుల ద్వారా తెలుసుకున్నారు.

కొద్దిపాటి చెస్ట్‌ పెయిన్‌ వచ్చినా వైరస్‌ లక్షణమేనని నిర్ధారించారు.ఈ నేపథ్యంలో పలు లక్షణాలు, వ్యాధులు కరోనా కారకాలుగా గుర్తించారు.

అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కరోనా వైరస్‌ సోకిన వ్యక్తులకు పొడిదగ్గు విపరీతంగా వేధిస్తోంది.

దీనివల్ల పక్కటేముకలు కూడా నొప్పి అవుతాయి.ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిగా మారుతుంది.

నిమోనియా కూడా కొవిడ్‌ లక్షణంగా నిర్ధారితమైంది.దీని వల్ల లంగ్స్‌లో ఇన్ఫెక్షన్‌ వస్తుంది.

ఫలితంగా ఛాతిలో నొప్పి వస్తుంది.లంగ్స్‌లో కొద్దిపాటి మంట వచ్చినా అది ఛాతినొప్పికి దారితీస్తుంది.

కరోనా రోగులు ఛాతినొప్పితో బాధపడతారు.దీని బారిన పడినవారు సీటీ స్కాన్, ఎక్స్‌రే తీసిన తర్వాత పరిస్థితిని చూసి చికిత్స అందిస్తారు.

గడ్డకట్టుకుపోయిన రక్తం విడిపోయి లంగ్స్‌ ద్వారా పల్మనరీ ఎంబాలిజానికి వ్యాపిస్తుంది.ఫలితంగా ఛాతినొప్పి ఏర్పడుతుంది.

కాలేయానికి రక్త సరఫరాను నిలిపివేస్తుంది.కరోనా వైరస్‌ వల్ల ఇది చోటు చేసుకుంటుంది.

దీనివల్ల కాలేయంలో నొప్పి వస్తుంది.ఇది కొవిడ్‌ వైరస్‌ బారిన పడిన రోగుల ద్వారా వైద్యులు గుర్తించగలిగారు.

కాబట్టి ఇటువంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే డాక్టర్లను సంప్రదించడం ఎంతో ఉత్తమం.వీలైనంత వరకూ సరైన జాగ్రత్తలు తీసుకుని కరోనాను అంతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

#Lung Infections #Chest Pain #Health Care #Corona Patients #Doctors

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు