బ్రూస్‌లీని ఆపే ప్రయత్నం!

Cherry Bruce Lee Movie Posponed..?

రామ్‌ చరణ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘బ్రూస్‌లీ’.భారీ అంచనాల నడుమ భారీ బడ్జెట్‌తో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

 Cherry Bruce Lee Movie Posponed..?-TeluguStop.com

శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు కోన వెంకట్‌ మరియు గోపీ మోహన్‌ల్‌లు స్క్రిప్ట్‌ను అందజేస్తున్నారు.ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని మెగా ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు.

మెగా స్టార్‌ చిరంజీవి గెస్ట్‌ రోల్‌లో ఈ సినిమాలో కనిపించడంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్‌ 16న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా నిర్మాత దానయ్య ప్రకటించాడు.

తాజాగా ఫిల్మ్‌ సర్కిల్స్‌ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ‘బ్రూస్‌లీ’ చిత్ర విడుదలను వాయిదా వేయించేందుకు ఇద్దరు ప్రముఖ నిర్మాతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.‘రుద్రమదేవి’ చిత్రం విడుదల అక్టోబర్‌ 9న ఉన్న నేపథ్యంలో ఆ ఇద్దరు నిర్మాతలు ‘బ్రూస్‌లీ’ చిత్రాన్ని వాయిదా వేసేలా చూస్తున్నారు.

ఆ ఇద్దరు నిర్మాతలు ‘రుద్రమదేవి’ చిత్రం పంపిణీ హక్కులు తీసుకున్నారు.అందుకే ఆ ఇద్దరు కూడా ‘బ్రూస్‌లీ’ని ఆపేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే నిర్మాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ‘బ్రూస్‌లీ’ని అనుకున్న సమయంకు విడుదల చేసి తీరుతాం అంటున్నాడు.అలా చేస్తే ఆ నిర్మాతలు థియేటర్లు దొరకుండా చేసే అవకాశాలున్నాయి.

అప్పుడు నిర్మాత దానయ్య ఏం చేస్తాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube