ఒకప్పటి ఈ తెలుగు హీరోయిన్ మీకు ఇంకా గుర్తుందా..?  

cheppave chirugali movie fame heroine ashima bhalla cine career news, Ashima bhalla, Telugu Yester Year Heroine, Tollywood, Daddy, cheppave chirugali movie - Telugu Ashima Bhalla, Cheppave Chirugali Movie, Cheppave Chirugali Movie Fame Heroine Ashima Bhalla Cine Career News, Daddy, Telugu Yester Year Heroine, Tollywood

తెలుగులో మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటించినటువంటి “డాడీ” చిత్రం ఇప్పటికే తెలుగు ప్రేక్షకులని బాగానే అలరించింది. అయితే ఈ చిత్రంలో రెండో హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ బ్యూటీ ఆషిమా భల్లా గురించి ఇప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకుందాం….

TeluguStop.com - Cheppave Chirugali Movie Fame Heroine Ashima Bhalla Cine Career News

అయితే ఆషిమా భల్లా అస్సాం రాష్ట్రంలో పుట్టి పెరిగింది.కాగా చిన్నప్పటినుంచి నటనపై ఆసక్తి ఉండటంతో పాఠశాలలో చదివే సమయంలోనే పలు నాటకాలు, అలాగే పలు ఈవెంట్స్ లో బాగా యాక్టివ్ గా పాల్గొనేది.

అంతేకాక అప్పట్లోనే ఈమె పలు ప్రముఖ సంస్థల ఉత్పత్తుల వాణిజ్య ప్రకటనల్లో కూడా నటించింది.ఆ తర్వాత బాలీవుడ్ లో “ప్యార్ జిందగీ హై” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది.

TeluguStop.com - ఒకప్పటి ఈ తెలుగు హీరోయిన్ మీకు ఇంకా గుర్తుందా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించడంతో వెంటనే మెగాస్టార్ చిరంజీవి డాడీ సినిమాలో రెండో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది.

అయితే ఆ తర్వాత టాలీవుడ్ ప్రముఖ హీరో వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన “చెప్పవే చిరుగాలి” చిత్రంలో కూడా రెండో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది.

ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించినప్పటికీ ఈ అమ్మడుకి కొత్త సినిమా అవకాశాలను మాత్రం తెచ్చి పెట్టలేక పోయింది.దీనికి తోడు తెలుగులో చెప్పుకోవడానికి తనకంటూ సరైన హిట్ లేక పోవడంతో ఎక్కువ కాలం సినీ పరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగలేక పోయింది.

దీంతో సినిమా అవకాశాలు కరువైన సమయంలో ఇక చేసేదేమీ లేక పలు ధారావాహికలలో కూడా నటించేందుకు సిద్ధమైంది.దీంతో హిందీలో 4 సీరియళ్లలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించింది.

కాగా ఆషిమా భల్లా తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, తదితర భాషలలో దాదాపుగా 11 కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.ప్రస్తుతం ఈ అమ్మడుకి ఎలాంటి సినిమా అవకాశాలు లేకపోవడంతో అస్సాంలో తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నట్లు సమాచారం.

#Ashima Bhalla #TeluguYester #Daddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Cheppave Chirugali Movie Fame Heroine Ashima Bhalla Cine Career News Related Telugu News,Photos/Pics,Images..