మొన్న కేజ్రీ పై... నేడు కమల్ పై!  

Cheppals Hurled At Kamal Haasan Vehicle-

మొన్నా మధ్య ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీ పై చెప్పు విసిరిన ఘటన గుర్తుండే ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా గ్లోబల్ స్టార్,మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ పై చెప్పు దాడి జరిగింది. విల్లుపురంలోని ఓక రోడ్ షో లో పాల్గొన్న కమల్ పై ఒక వ్యక్తి చెప్పు విసిరినట్లు తెలుస్తుంది..

మొన్న కేజ్రీ పై... నేడు కమల్ పై!-Cheppals Hurled At Kamal Haasan Vehicle

అయితే అదృష్టవశాత్తు అది కమల్ కు తగలలేదు. అయితే మరికొందరు కూడా కమల్ పై చెప్పులు విసిరేందుకు ప్రయత్నించడం తో వెంటనే అప్రమత్తమైన పోలీ సులు వారిని అడ్డుకోవడం తో ప్రమాదం తప్పింది. దీనితో పోలీసులు వెంటనే చెప్పు విసిరిన వ్యక్తి తో పాటు మరో 11 మందిని అదుపులోకి తీసుకోవడం తో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఇటీవల కమల్ హిందువులను టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

స్వతంత్ర భారతదేశం లో మొట్ట మొదటి ఉగ్రవాది హిందువే నని, మహాత్మా గాంధీ ని హత్య చేసిన నాధూరాం గాడ్సే హిందూత్వ నేత అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీనితో పలు హిందూ సంస్థలు,రాజకీయ నేతలు,సినీ ప్రముఖులు సైతం కమల్ పై మండిపోతున్నారు. మరోపక్క కమల్ పై ఢిల్లీ కోర్టు లో కూడా పిటీషన్ దాఖలు అవ్వగా దానికి ఢిల్లీ కోర్టు తమిళనాడు ఫోరమ్ ని సంప్రదించాలి అంటూ పిటీషనర్ కు సూచన కూడా చేసింది.

అయితే ఈ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో రెండు రోజుల పాటు బయటకు కూడా రాని కమల్ భారీ బందోబస్తు తో బుధవారం రోడ్ షో లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయనపై అనూహ్యంగా చెప్పుల దాడి చోటుచేసుకుంది.