హమ్మయ్య …! అది కుక్క మాంసం కాదట.! రిపోర్ట్ లో ఏమని వచ్చిందో తెలుస్తే ఆశ్చర్యపోతారు!

రోడ్ మీద ఏదైనా కుక్క కనిపిస్తే ఏం చేస్తాం .? ఛీ ఛీ అంటూ చీదరించుకుంటూ వెళ్ళిపోతాం.అయితే అటువంటి కుక్క మాంసం గురించి చెప్తే వాంతి వచ్చినంత పనవుతుంది.కానీ తమిళనాడులో ఓ ఆశ్చర్యకర సంఘటన చోటుచేసుకుంది.ఓ పార్శిల్‌ లో దాదాపు 2000 కిలోల కుక్కమాంసం బయటపడింది.ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.

 Chennai Tanuvas Confirms That Seized Consignment Is Not Dog Meat-TeluguStop.com

ఫుడ్‌ సెక్యూరిటీ అధికారులతో రైల్వే స్టేషన్ కు వచ్చిన పోలీసులు ఆ పార్సిల్ ను తెరచి చూశారు.అందులో మాంసం కనిపించేసరికి వారు షాక్ కు గురయ్యారు.దాదాపు 2000 కిలోల కుక్క మాంసంగా భావించిన ఫుడ్‌ సెక్యూరిటీ అధికారులు పరీక్షల నిమిత్తం దానిని ల్యాబ్‌కు తీసుకువెళ్లారు.

రాజస్తాన్‌ రాష్ట్రం జోథ్‌పూర్‌ నుంచి ఈ మాంసాన్ని ఐస్‌ పెట్టెల్లో ఉంచి తీసుకు రాగా, ఆ పెట్టెలపై ఉన్న చిరునామా ఆధా రంగా నగర పోలీసులు విచారణ చేపట్టారు.ఈ ఘటన మాంసాహార ప్రియులను హడలెత్తించింది.అంతే కాకుండా బిరియాని విక్రయాలు కూడా పడిపోయాయి.

ఈ నేపథ్యంలో గురువారం చెన్నై పశుసంవర్థక శాఖ వైద్య అధికారులు పోలీసులు స్వాధీనం చేసుకున్నది కుక్క మాంసం కాదని, మేక మాంసమేనని తమ పరిశోధనల్లో తేలిందన్నారు.ఈ మాంసం గడువు ముగిసిన అనంతరం రాష్ట్రానికి చేరడం వల్లే ఈ అనుమానం వచ్చిందని వారు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube