ఈ రోజు ఐపీఎల్ లో సన్ రైజర్స్ తో చెన్నై మ్యాచ్.. ఏ జట్టుకు ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నాయో చూడండి...

సీజన్ ఆరంభంలో దూకుడు చూపించిన సన్ రైజర్స్ జట్టు మధ్య లో గాడి తప్పినప్పటికి మళ్ళీ గెలుపు బాట పట్టింది.ఈ సీజన్ లో చెన్నై తో ఆడిన గత మ్యాచ్ లో చెన్నై బ్యాట్స్ మెన్ లను కట్టడి చేసి భారీ విజయాన్ని అందుకుంది.

 Chennai Super Kings Vs Sunrisers Hyderabad Who Will Win-TeluguStop.com

ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్స్ ఆశలు నిలుపుకోవాలనుకుంటుంది.ఆ జట్టు ఓపెనర్లు డేవిడ్ వార్నర్ , బైర్ స్టో లో ఈ సీజన్ లో తమ అత్యున్నత ఫామ్ లో ఉన్నారు.

ఈ మ్యాచ్ లో వారు రాణిస్తే సన్ రైజర్స్ జట్టు భాది స్కోర్ చేసే అవకాశాలు ఉన్నాయి.ఇకపోతే వరుస విజయాలతో సీజన్ ఆరంభం నుండి దూకుడు చూపించిన జట్టు వరుస గా రెండు మ్యాచ్ లలో ఓటమి పొందింది.ఈ మ్యాచ్ లో గెలిస్తే చెన్నై జట్టు దాదాపు ప్లే ఆఫ్స్ కి వెళ్లినట్లే.

1)ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లలో రికార్డ్ లు ఎలా ఉన్నాయి

ఇప్పటి వరకు చెన్నై కి సన్ రైజర్స్ కి జరిగిన 11 మ్యాచ్ లలో చెన్నై జట్టు 8 మ్యాచ్ లలో గెలవగా సుంర్ రైజర్స్ జట్టు కేవలం 3 మ్యాచ్ లలో విజయం సాధించింది.

2)పిచ్ ఎలా ఉండబోతుంది

ఈ మ్యాచ్ చెన్నై లో జరగనుంది ,ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన చాలా వరకు మ్యాచ్ లలో భారీ స్కోర్ లు నమోదు కాలేదు.ఈ సారి కూడా పిచ్ స్పిన్నర్లకు అనుకూలించనుంది.మొదట బ్యాటింగ్ చేసే జట్టు 150 కి పైగా పరుగులు చేయగలిగితే విజయావకాశాలు ఉంటాయి.

3)సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎలా ఉండబోతుంది

వరుసగా రెండు విజయాలు సాధించి మంచి జోరు లో ఉన్న సన్ రైజర్స్ జట్టు జట్టు లో పెద్దగా మార్పులేమి చేయకుండా బరిలోకి దిగనుంది.ఇకపోతే ఆ జట్టు బ్యాటింగ్ బలమంతా వారి ఓపెనర్లే .ఒకవేళ వాళ్ళు త్వరగా వెనుదిరిగితే రైజర్స్ మిడిల్ ఆర్డర్ ఎలా ఆడుతుందో అని జట్టు యాజమాన్యం అసంతృప్తితో ఉంది.ఈ సీజన్ లో ఆ జట్టు మిడిల్ ఆర్డర్ వల్ల గెలిచిన మ్యాచ్ లు ఒకటి కూడా లేదు.ఇకపోతే బౌలింగ్ లో రషీద్ , భువి లతో బలంగా కనిపిస్తుంది.

ఈ మ్యాచ్ లో గెలిస్తే పాయింట్ ల పట్టికలో ముందడుగు వేసే అవకాశం ఉంది.

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ( PROBABLE XI ) – డేవిడ్ వార్నర్ , జానీ బైర్ స్టో , కేన్ విల్లియమ్సన్ , విజయ్ శంకర్ , యూసుఫ్ పఠాన్ , దీపక్ హూడా , షాదబ్ నదీమ్, రషీద్ ఖాన్ , భువనేశ్వర్ కుమార్ , సందీప్ శర్మ , ఖలీల్

4)చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎలా ఉండబోతుంది

వరుసగా మ్యాచ్ లు గెలుస్తూ జోరు మీద ఉన్న చెన్నై జట్టు వరుసగా రెండు మ్యాచ్ లలో ఓటమి పాలయింది.బెంగళూర్ తో జరిగిన మ్యాచ్ లో చివరి బంతి వరకు పోరాడిన మ్యాచ్ ని మాత్రం గెలవలేకపోయింది.సన్ రైజర్స్ తో గత మ్యాచ్ లో ఓడిన చెన్నై జట్టు ఈ మ్యాచ్ లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది.

ఇకపోతే ఈ మ్యాచ్ చెన్నై సొంతగడ్డ పైన జరగనుంది.ఈ సీజన్ లో ఇక్కడ ఆడిన ప్రతి మ్యాచ్ లో చెన్నై జట్టే గెలుస్తూ వస్తుంది.ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టాలని ఆ జట్టు భావిస్తుంది.చెన్నై జట్టు టాప్ ఆర్డర్ రాణిస్తే ఆ జట్టు గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ( PROBABLE XI ) – ఫాఫ్ డూప్లెసిస్ ,షేన్ వాట్సన్ ,సురేష్ రైనా , ధోని ,కేదార్ జాధవ్ , రవీంద్ర జడేజా ,అంబటి రాయుడు ,డ్వెన్ బ్రావో , చహార్ , ఇమ్రాన్ తహిర్ , శార్దూల్ ఠాకూర్

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube