ఈ రోజు ఐపీఎల్ లో బెంగళూర్ తో చెన్నై మ్యాచ్.. ఏ జట్టు కి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో చూడండి...  

Chennai Super Kings Vs Royal Challengers Bangalore Match Prediction-ipl 12th Session,ipl 35th Match Prediction,ipl Today Match,royal Challengers,చెన్నై సూపర్ కింగ్స్,రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్

వరుస విజయాలతో దూసుకెళ్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సన్ రైజర్స్ జట్టు బ్రేకులు వేసింది. చెన్నై తమ గత మ్యాచ్ లో ధోని కి విశ్రాంతి ఇచ్చారు. ఈ రోజు బెంగళూర్ తో జరిగే మ్యాచ్ లో ధోని బరిలోకి దిగనున్నాడు..

ఈ రోజు ఐపీఎల్ లో బెంగళూర్ తో చెన్నై మ్యాచ్.. ఏ జట్టు కి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో చూడండి...-Chennai Super Kings Vs Royal Challengers Bangalore Match Prediction

సన్ రైజర్స్ తో మ్యాచ్ లో చెన్నై బ్యాట్స్ మెన్ దూకుడుగా ఆడకపోవడం తో ఆ జట్టు భారీగా పరుగులు చేయలేకపోయింది. చెన్నై జట్టు బెంగళూర్ తో మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్స్ కి అర్హత సాధించాలనుకుంటుంది. ఇకపోతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్ నుండి నిష్క్రమించిన సంగతి తెలిసిందే.

కోల్ కత్తా తో మ్యాచ్ లో బ్యాట్స్ మెన్ లు బౌలర్లు సమిష్టిగా రాణించడం తో ఆ జట్టు విజయం సాధించింది.

1)ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలో రికార్డ్ లు ఎలా ఉన్నాయి

చెన్నై , బెంగళూర్ జట్లు ఇప్పటి వరకు 24 మ్యాచ్ లు ఆడగా చెన్నై 16 మ్యాచ్ లలో గెలవగా , బెంగళూర్ జట్టు 7 మ్యాచ్ లలో విజయం సాధించింది. ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు.

2)పిచ్ ఎలా ఉండబోతుంది

ఈ మ్యాచ్ బెంగళూర్ లోని చిన్నస్వామి స్టేడియం లో జరగనుంది.ఇక్కడ పిచ్ బ్యాటింగ్ కి అనుకూలించనుంది.

బ్యాట్స్ మెన్ మొదట ఆరు ఓవర్లలో వికెట్ లు కాపాడుకోగలిగితే భారీ స్కోర్ చేసే వీలుంటుంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ తీసుకునే అవకాశాలున్నాయి..

3)రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు ఎలా ఉండబోతుంది

బెంగళూర్ జట్టు కోల్ కత్తా తో జరిగిన మ్యాచ్ లో అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించి విజయం సాధించారు. ముఖ్యంగా బ్యాటింగ్ లో కోహ్లీ , మెయిన్ అలీ లు విజృభించడం తో ఆ జట్టు 200 పైగా పరుగులు చేసింది. బౌలింగ్ లో కూడా స్టెయిన్ , నవదీప్ సైని లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.

బెంగళూర్ ఈ సీజన్ మొదటి మ్యాచ్ లో చెన్నై పైన ఓటమి కి ప్రతీకారం తో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యం తో బరిలోకి దిగనున్నారు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు ( PROBABLE XI ) – పార్థివ్ పటేల్ , విరాట్ కోహ్లీ , డివిలియర్స్ , మార్కస్ స్టయిన్స్ , మెయిన్ అలీ , అక్షదీప్ నాథ్ , పవన్ నేగి , చహల్ , ఉమేష్ యాదవ్ , డెల్ స్టెయిన్ , నవదీప్ సైని

4)చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎలా ఉండబోతుంది

వరుస విజయాలతో ఊపు మీద ఉన్న చెన్నై జట్టు జోరుకి సన్ రైజర్స్ జట్టు కళ్లెం వేసింది. చెన్నై ప్లే ఆఫ్స్ కి వెళ్లాలంటే మరొక మ్యాచ్ లో విజయం సాధిస్తే చాలు. గత మ్యాచ్ లో విశ్రాంతి తీసుకున్న ధోని బెంగళూర్ తో మ్యాచ్ లో ఆడనున్నాడు.

చెన్నై జట్టు బ్యాట్స్ మెన్ లో రాణించి మంచి స్కోర్ ని సాధిస్తే ఆ జట్టుకి గెలిచే అవకాశాలు ఉన్నాయి. చెన్నై జట్టు ఎలాగైనా బెంగళూర్ తో జరిగే మ్యాచ్ లో గెలిచే ప్లే ఆఫ్స్ కి చేరాలన్న లక్ష్యం తో బరిలోకి దిగనుంది.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ( PROBABLE XI ) – ఫాఫ్ డూప్లెసిస్ ,షేన్ వాట్సన్ ,సురేష్ రైనా , ధోని ,కేదార్ జాధవ్ , రవీంద్ర జడేజా ,అంబటి రాయుడు , సంట్నర్ , చహార్ , ఇమ్రాన్ తహిర్ , శార్దూల్ ఠాకూర్