ఈ రోజు ఐపీఎల్ లో పంజాబ్ తో చెన్నై మ్యాచ్ , ఏ జట్టుకి ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయో చూడండి...  

Chennai Super Kings Vs Kings Xi Punjab Who Will Win-

12 వ సీజన్ ఐపీఎల్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నై జట్టుకి ముంబై ఇండియన్స్ బ్రేక్ వేసింది ,చెన్నై ముంబైతో ఆడిన మ్యాచ్ లో చేదనలో నిలవలేకపోయింది.ఆ జట్టు గెలిచిన అన్ని మ్యాచ్ లలో బౌలర్ల ప్రతిభే ఎక్కువ ఉంది.

Chennai Super Kings Vs Kings Xi Punjab Who Will Win- -Chennai Super Kings Vs XI Punjab Who Will Win-

అయితే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో ఆడే మ్యాచ్ సొంత గ్రౌండ్ లో కాబట్టి అక్కడ ఫ్యాన్స్ సపోర్ట్ తో పాటు పిచ్ కూడా చెన్నై బౌలర్లకు అనుకూలిస్తుంది.చెన్నై ఓపెనర్లు ఫామ్ లేక సతమతమవుతున్నారు.ఇకపోతే పంజాబ్ గత మ్యాచ్ లో ఢిల్లీ తో అనూహ్యంగా మ్యాచ్ లో గెలిచి మంచి ఊపు మీద ఉంది.బ్యాటింగ్ లో అందరూ ఫామ్ లోకి రావడం , డెత్ బౌలింగ్ లో పటిష్టంగా ఉండడం ఆ జట్టు బలం.

1)ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లలో రికార్డులు ఎలా ఉన్నాయి

Chennai Super Kings Vs Kings Xi Punjab Who Will Win- -Chennai Super Kings Vs XI Punjab Who Will Win-

ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 20 మ్యాచ్ లు జరగగా చెన్నై 12 మ్యాచ్ లు గెలుపొందింది.పంజాబ్ 8 మ్యాచ్ లలో విజయం సాధించింది.

2)పిచ్ ఎలా ఉండబోతుంది

చెన్నై , పంజాబ్ మ్యాచ్ చెన్నై లో జరగనుంది.ఇక్కడ పిచ్ నెమ్మదిగా ఉండబోతుంది , ముఖ్యంగా స్పిన్నర్లకి బాగా అనుకూలిస్తుంది.మొదట బ్యాటింగ్ చేసే జట్టు160 నుండి 170 పరుగులు చేయగలిగితే గెలిచే అవకాశాలు ఉన్నాయి.

3)కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఎలా ఉండబోతుంది

పంజాబ్ తన చివరి మ్యాచ్ లో క్రిస్ గేల్ లేకుండానే ఆడింది.ఈ మ్యాచ్ లో క్రిస్ గేల్ ఆడనున్నాడు.ఇకపోతే బ్యాటింగ్ లో పెద్దగా మార్పులేమి ఉండకపోవచ్చు.బౌలింగ్ లో షమీ , అశ్విన్ , శ్యామ్ కుర్రాన్ లతో పటిష్టంగా ఉంది.గత మ్యాచ్ లో తన ఆల్ రౌండర్ ప్రదర్శనతో పంజాబ్ ని ఒంటిచేత్తో గెలిపించిన కుర్రాన్ ఈ మ్యాచ్ లో రాణిస్తే పంజాబ్ కి గెలిచే అవకాశాలు ఉంటాయి.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ( PROBABLE XI ) – కె.ఎల్ .రాహుల్ , క్రిస్ గేల్ , మయంక్ అగర్వాల్ , కరుణ్ నాయర్ , మన్దీప్ సింగ్ , శ్యాం కుర్రాన్ , అశ్విన్ , టై , షమీ , అంకిత్ రాజ్పుత్ , ముజీబ్ రెహ్మాన్

4)చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎలా ఉండబోతుంది

ముంబై తో ఆడిన చివరి మ్యాచ్ లో ఓటమి పాలైన ధోని సేన ఈ మ్యాచ్ లో గెలిచి మళ్ళీ విజయాల బాట పట్టాలనుకుంటుంది.చెన్నై బౌలింగ్ బాగానే ఉన్నా బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ విఫలమవుతూనే వస్తుంది.

ముఖ్యంగా రాయుడు , వాట్సన్ లు ఫామ్ లేక ఇబ్బందిపడుతున్నారు.వీరిద్దరూ ఫామ్ లోకి వస్తే చెన్నై జట్టు బ్యాటింగ్ లో బలంగా అవుతుంది.

సొంత గడ్డ పైన అడుతుండడం అక్కడ పిచ్ చెన్నై బౌలర్లకు కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు (PROBABLE XI ) : అంబటి రాయుడు , షేన్ వాట్సన్ , బ్రావో , సురేష్ రైనా , ఎం ఎస్ ధోని , కేదార్ జాధవ్ , రవీంద్ర జడేజా , దీపక్ చహార్ , శార్దూల్ థాకూర్ , తహిర్, మిట్చెల్ సన్తంర్

.

తాజా వార్తలు

Chennai Super Kings Vs Kings Xi Punjab Who Will Win- Related....