ఈ రోజు ఐపీఎల్ లో పంజాబ్ తో చెన్నై మ్యాచ్ ... ఏ జట్టుకు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయో చూడండి...

ఈ వారం లో ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లు ముగియనున్నాయి.ప్రస్తుతం పంజాబ్ జట్టు ప్లే ఆఫ్స్ రేస్ నుండి తప్పుకుంది.

 Chennai Super Kings Vs Kings Xi Pun Match Predection-TeluguStop.com

ఆ నట్టు చెన్నై తో జరిగే మ్యాచ్ లో విజయం సాధించి గెలుపు తో టోర్నీ ని ముగించాలని ఆశిస్తోంది.ఇకపోతే చెన్నై జట్టు ఈ మ్యాచ్ లో గెలిచి పాయింట్ ల పట్టిక లో అగ్రస్థానం లో ఉండాలని ఆడబోతుంది.

ఈ సీజన్ లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై గెలుపొందింది.

1)ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలో రికార్డ్ లు ఎలా ఉన్నాయి

ఇప్పటి వరకు చెన్నై కి పంజాబ్ కి మధ్య 21 మ్యాచ్ లు జరగగా చెన్నై 13 మ్యాచ్ లలో విజయం సాధించగా పంజాబ్ 8 మ్యాచ్ లలో గెలుపొందింది.

2)పిచ్ ఎలా ఉండబోతుంది

ఈ మ్యాచ్ మొహాలీ లో జరగనుంది.ఇక్కడి పిచ్ బ్యాటింగ్ కి అనుకూలించనుంది.మొదట బ్యాటింగ్ చేసే జట్టు భారీ స్కోర్ చేసే అవకాశాలు ఉన్నాయి.

ఈ రోజు ఐపీఎల్ లో పంజాబ్ తో చెన

3)కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఎలా ఉండబోతుంది

వరుసగా గత రెండు మ్యాచ్ లలో ఓటమి పాలై ప్లే ఆఫ్స్ బరిలో నుండి నిష్క్రమించిన పంజాబ్ జట్టు అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో బలహీనంగా కనిపిస్తుంది.ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు కీలక సమయాల్లో రాణించలేకపోతున్నారు.ఇకపోతే చెన్నై తో జరిగే మ్యాచ్ లో రాహుల్ లేదా గేల్ లు చెలరేగితే ఆ జట్టు భారీ పరుగులు చేసే అవకాశం ఉంటుంది.

ఇక బౌలింగ్ లో ఆ జట్టు కెప్టెన్ అశ్విన్ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు.మహమ్మద్ షమీ పవర్ ప్లే లో బౌలింగ్ బాగానే చేస్తున్న డెత్ ఓవర్ లలో భారీగా పరుగులు సమర్పిస్తున్నాడు.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ( PROBABLE XI ) – లోకేష్ రాహుల్ , క్రిస్ గేల్ , మాయాంక్ అగర్వాల్ , మనిదీప్ సింగ్ ,నికోలస్ పూరన్ , శ్యాం కుర్రాన్ , రవి అశ్విన్ , మురిగాన్ అశ్విన్ , అంకిత్ రాజ్పుత్ , మహమ్మద్ షమీ, ఆండ్రి టై

ఈ రోజు ఐపీఎల్ లో పంజాబ్ తో చెన

4)చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎలా ఉండబోతుంది

చెన్నై కట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్ కి చేరి పాయింట్ ల పట్టికలో అగ్రస్థానం లో కొనసాగుతుంది.ఆ జట్టు బ్యాటింగ్ లో బౌలింగ్ లో సమిష్టిగా రాణిస్తూ ముందుకు దూసుకుపోతుంది.ఇకపోతే బౌలింగ్ లో ఇమ్రాన్ తహిర్ , హర్భజన్ , జడేజా లో తమ స్పిన్ తో ప్రత్యర్థి జట్టు ని ఇబ్బంది పెడుతున్నారు.ప్లే ఆఫ్స్ కి ముందు జరిగే చివరి మ్యాచ్ కాబట్టి ఫామ్ లో లేని ఆటగాళ్లు ఈ మ్యాచ్ ని సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నారు.

ఆ జట్టు కెప్టెన్ జట్టు లో ఎలాంటి మార్పులు చేస్తాడో వేచి చూడాల్సిందే.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ( PROBABLE XI ) – వాట్సన్ , డూప్లెసిస్ , సురేష్ రైనా , అంబటి రాయుడు , ధోని , కేదార్ జాధవ్ , జడేజా , బ్రేవో , దీపక్ చహార్ , హర్భజన్ , ఇమ్రాన్ తహిర్

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube