వైరల్ వీడియో: లైవ్ లో లవ్ ప్రపోజల్ పెట్టిన చెన్నై ప్లేయర్.. చివరికి..?!

ఐపీఎల్‌-2021 మ్యాచ్ లో భాగంగా ఒక స్టేడియంలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుందనే చెప్పాలి.ఐపీఎల్ 2021 రెండో దశలో భాగంగా ఈరోజు చెన్నై సూపర్‌ కింగ్స్‌, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య హోరాహోరీగా జరిగిన మ్యాచ్ అనంతరం ఈ సంఘటన జరిగింది.

 Chennai Player Who Made A Love Proposal Live .. In The End ..?! Deepak Chahar,-TeluguStop.com

ఈ సంఘటనతో ఒక్కసారిగా స్టేడియంలో ఉన్నవారు అంతా షాక్ కి గురయ్యారు.సీఎస్‌కే ఆల్‌రౌండర్‌ దీపక్‌ చాహర్‌ చేసిన పని అందరిలోనూ ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఇంతకు అతను ఏమి చేసాడంటే అందరూ చూస్తుండగా చాహర్ లైవ్‌ లో తన గర్ల్‌ ఫ్రెండ్‌ కు రింగ్‌ తొడిగి లవ్‌ ప్రపోజ్‌ చేసి సర్ప్రైజ్ చేసాడు.

మోకాళ్లపై నిలబడి రింగ్ తీసి ఆమెకి లవ్ ప్రొపోజ్ చేయగా ఆమె కూడా అతనికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో స్టేడియంలో ఉన్నవారి అరుపులతో, చప్పట్లతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా మారుమోగిపోయింది.

కాగా చాహర్‌, అతని ప్రేయసి ఉంగరాలు మార్చుకున్న తర్వాత ఒకరినొకరు సంతోహంగా కౌగిలించుకున్నారు.వీరి ప్రేమాయణంను స్టేడియంలో ఉన్నవారు అందరు వీక్షించారు .ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

టీమిండియా ఆటగాళ్లతో పాటు మొత్తం క్రికెట్‌ ప్రపంచం అంతా ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.ఇదిలా ఉండగా చాహర్‌ ప్రపోజ్‌ చేసిన అమ్మాయి విదేశీ యువతిగా తెలుస్తోంది.చాహర్ లవ్ ప్రొపోజ్ చేసిన వెంటనే ఆ యువతీ ఆనందానికి అవధులు లేవు అనే చెప్పాలి.

ఆ ప్రేమ జంటకు ఆరోజు జీవితాంతం గుర్తిండి పోతుంది అనే చెప్పాలి.అయితే కొందరు ఈ ప్రేమ పావురాలకు విషెస్ చెబుతుంటే మరి కొందరు మాత్రం చాహర్‌ చేసిన పనిని తప్పుబడుతున్నారు.

ఆడవలిసిన మ్యాచ్‌ పై ఏకాగ్రత చేయకుండా లైవ్‌ లో ఇలాంటి పని చేయడం ఏంటి అని కొందరు ప్రశ్నిస్తున్నారు.ఏది ఏమయినా ఈ వీడియో మాత్రం బాగా వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube