వామ్మో..14,400 ఫోన్లు దొంగతనం... ఎక్కడంటే?

మన ఫోన్ ఎవరైనా దొంగలించిన అప్పుడు దానిని కనిపెట్టడానికి సెల్ నెంబర్లు, ఫోన్ ఈఎంఐ నెంబర్లను ట్రాప్ చేసి ఆ ఫోన్ ఎక్కడుందో కనిపెడుతున్నారు.కానీ ఏకంగా 14,400 ఫోన్లు దొంగతనం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుంది? వాటిని కనిపెట్టడం ఎంతో అసాధ్యం తో కూడుకున్న పని.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14,400 ఫోన్లను దొంగలించిన ఘటన ఒకటి చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల మేరకు…

 Chennai Mobile Phones Theft 14 400 Phones-TeluguStop.com

చెన్నై నుంచి ముంబై కి 14,400 సెల్ ఫోన్ లో లోడ్ తో బయలుదేరిన లారీని కొంత మంది దొంగల ముఠాలు అడ్డుపడి అందులో ఉన్న సెల్ ఫోన్ అన్నింటికీ దొంగతనం చేశారు.

చెన్నై నుంచి ముంబై కి వెళ్తున్న లారీని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆపి అందులో ఉన్న డ్రైవర్ ను, క్లీనర్ ను కాళ్లు చేతులు కట్టి పడేసి మొత్తం సెల్ ఫోన్లు దొంగలించారు.ఈ సెల్ ఫోన్ లు మొత్తం దాదాపు 15 కోట్ల రూపాయల విలువ చేస్తాయని భావిస్తున్నారు.

 Chennai Mobile Phones Theft 14 400 Phones-వామ్మో..14,400 ఫోన్లు దొంగతనం… ఎక్కడంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ చోరీ అనంతరం లారీని అక్కడి నుంచి వారితోపాటు తీసుకువెళ్లి 8 కిలోమీటర్ల దూరంలో వదిలేసి వెళ్లారు.ఈ ఘటన జరిగిన తర్వాత లారీ డ్రైవర్ పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం మొత్తం చెప్పడంతో, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

అన్ని సెల్ ఫోన్లు దొంగతనం చేయడానికి గల కారణాలు ఏమిటి? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.అయితే తొందర్లోనే ఈ దొంగతనానికి పాల్పడిన వారిని పట్టుకొని శిక్ష పడేలా చేస్తామని ఈ సందర్భంగా పోలీసులు తెలియజేశారు.

సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు ఎటువంటి ఆధారాలు కూడా దొరకకపోవడంతో ఎంతో ప్లాన్ చేసి ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలియజేశారు.

#ChennaiTo #14.400Phones #ChennaiMobile #LorryDriver #Police Case

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు