కరోనా లిఫ్ట్: ఎక్కాలి అంటే చేత్తో కాదు,కాలితో నొక్కాలట  

Chennai Metros New Initiative Against Covid 19 - Telugu Chennai, Coimbatore, Corona Virus, Doors, Lifts, Metro Rail Limited, Shake Hands

కరోనా తో సహజీవనం తప్పదు అంటూ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ మహమ్మారికి చెక్ పెట్టె దిశగా చర్యలు మొదలుపెట్టారు.ఇంటి తలుపులు,లిఫ్ట్ లు నొక్కేటప్పుడు చేతులు ఉపయోగించడం ద్వారా కూడా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది అని అందుకే వాటిని ముట్టుకొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ సూచిస్తున్న విషయం విదితమే.

 Chennai Metros New Initiative Against Covid 19

ఈ నేపథ్యంలో కరోనా లిఫ్ట్ లు వచ్చేశాయి.కరోనా లిఫ్ట్ లు అంటే అవేవో వెరైటీ లిఫ్ట్ లు అని అనుకోనేరు.

చేతులు పెట్టకుండా కాలితో ఈ లిఫ్ట్ ను ఆపరేట్ చేసేలా సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసువచ్చింది.ఇంతకీ ఈ వెరైటీ లిఫ్ట్ ఎక్కడ అని అనుకుంటున్నారా.చెన్నై లో మెట్రో రైల్ సంస్థ ఈ సరికొత్త లిఫ్ట్ లను తయారు చేసినట్లు తెలుస్తుంది.కరోనా నేపథ్యంలో ఇంటి తలుపులు మొదలు ఆఫీసులలో కంప్యూటర్ల వరకు ఇలా దేన్ని చేతితో తాకాలన్నా ప్రజలు వణికిపోతున్నారు.

కరోనా లిఫ్ట్: ఎక్కాలి అంటే చేత్తో కాదు,కాలితో నొక్కాలట-General-Telugu-Telugu Tollywood Photo Image

చివరికి ఆత్మీయంగా ఇచ్చుకునే షేక్ హ్యాండ్‌కు కూడా దూరమయ్యారు.అనుమానపు చూపులు ఎక్కువయ్యాయి.

ఈ క్రమంలో చెన్నై మెట్రో రైల్ సంస్థ ఈ సరికొత్త లిఫ్టులను తయారుచేసి అందుబాటులోకి తీసుకువచ్చింది.సాధారణంగా మనం లిఫ్టును తెరవాలంటే దానిపై కనిపించే నంబర్లను చేతితో నొక్కుతాం.

లిఫ్టు లోపలికి వెళ్లాక కూడా ఏ ఫ్లోర్‌కు వెళ్లాలో ఆ నెంబర్‌ను చేతితోనే నొక్కుతాం.ఇలా చేయడం వల్ల కరోనా వ్యాపిస్తుందని ఈ విధానానికి చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ స్వస్తి పలికింది.

లిఫ్టులను కాలితో ఆపరేట్ చేసేలా కొత్త తరహాలో రూపొందించింది.ఈ మేరకు కోయంబత్తూరు మెట్రో స్టేషన్‌లోని లిఫ్టులు అన్నింటి మీటలను కాలితో నొక్కేలా తయారు చేసింది.దీంతో ప్రయాణికులు చేతిని వాడే పనిలేకుండా కాలితోనే లిఫ్టును ఆపరేట్ చేస్తున్నారు.ప్రస్తుతం కోయంబత్తూరు మెట్రో స్టేషన్లోనే ఉన్న ఈ సదుపాయాన్ని అన్ని రైల్వే స్టేషన్లకు విస్తరించనున్నట్లు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ వెల్లడించింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Chennai Metros New Initiative Against Covid 19 Related Telugu News,Photos/Pics,Images..

footer-test