'దోశ కింగ్‌' అంటూ ఆకాశానికి ఎత్తిన వారే ఇప్పుడు థూ.. అంటూ ఉమ్మేస్తున్నారు

తమిళనాడుకు చెందిన రాజగోపాల్‌ అంటే ఠక్కున ఎవరికి తెలియదు.తమిళనాడు వారికి కూడా రాజగోపాల్‌ అంటే ఎక్కువగా తెలియదు.

 Chennai Dosa King Is Now Under Chennai Cop-TeluguStop.com

అదే శరవణ భవన్‌ దోశ కింగ్‌ అంటే ఇండియాతో పాటు ఇతర దేశాల్లో కూడా ఆయన్ను గుర్తు పడతారు.ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పాతిక హోటల్స్‌ను ఏర్పాటు చేసిన శరవణ భవన్‌ రాజగోపాల్‌ ఎంతో పేరు పొందండంతో పాటు వందల కోట్ల రూపాయలను సంపాదించాడు.

శరవణ భవన్‌ అంటే ఒక బ్రాండ్‌ అన్నట్లుగా తయారు చేశారు.తమిళనాడులోని ఒక చిన్న ప్రాంతం నుండి సాదారణ వ్యక్తిగా జీవితాన్ని ఆరంభించిన రాజగోపాల్‌ ప్రపంచ స్థాయి గుర్తింపును దక్కించుకున్నాడు.

అంతటి గుర్తింపు దక్కించుకున్న వ్యక్తి ఒక స్త్రీ పై వ్యామోహం పెంచుకుని ఇప్పుడు జైలు పాలు కాబోతున్నాడు.

'దోశ కింగ్‌' అంటూ ఆకాశానికి ఎత�

రాజగోపాల్‌కు జాతకాల పిచ్చి ఎక్కువ.ఆ జాతకాల పిచ్చితోనే రెండు పెళ్లిలు చేసుకున్నాడు.రెండు పెళ్లిలు అయిన తర్వాత కూడా 2000వ సంవత్సరంలో ఒక జ్యోతిష్యుడు మూడవ పెళ్లి చేసుకోమంటూ సూచించాడు.

అది కూడా నీ వద్ద పని చేస్తున్న వ్యక్తి కూతురును పెళ్లి చేసుకో అంటూ ఒక అమ్మాయిని చూపించడం జరిగిందట.అప్పటికే ఆమెకు పెళ్లి అవ్వడంతో రాజగోపాల్‌తో పెళ్లికి నిరాకరించిందట.

జ్యోతిష్యుడు చెప్పాడని మరియు ఆమెపై వ్యామోహం పెంచుకుని ఆమెను అనుభవించాలనుకున్న రాజగోపాల్‌ ఆమెను దక్కించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు.

'దోశ కింగ్‌' అంటూ ఆకాశానికి ఎత�

2001వ సంవత్సరంలో ఆమె భర్తను చంపేయించాడు.భర్త చనిపోయిన తర్వాత కూడా ఆమె రాజగోపాల్‌కు దక్కేందుకు నో చెప్పింది.మరో వైపు హత్య కేసులో సుదీర్ఘ విచారణ తర్వాత రాజగోపాల్‌కు కోర్టు శిక్షను ఖరారు చేసింది.

మూడ నమ్మకం మరియు స్త్రీ వ్యామోహంతో హత్యకు పాల్పడ్డందుకు గాను యావజ్జీవ కారాగార శిక్షను కోర్టు విధించింది.దోశకింగ్‌గా పేరు దక్కించుకున్న రాజగోపాల్‌ ఇప్పుడు జైలులో చిప్ప కూడు తినేందుకు సిద్దం అవుతున్నాడు.

కోర్టులో జులై 7వ తారీకున ఆయన లొంగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube