ధనుష్ కు డెడ్ లైన్ ఇచ్చిన హైకోర్టు

తమిళ స్టార్ హీరో, రజనీకాంత్ అల్లుడు ధనుష్ గురించి ప్రత్యేకముగా చెప్పనవసరం లేదు.తమిళ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక స్టార్ డమ్ తెచ్చుకున్న హీరో ధనుష్ ఎవరికి కొడుకు? అనే ప్రశ్నకు మాత్రం ఇంకా క్లారిటీ లభించలేదు.ధనుష్ తమ కుమారుడు అంటూ కదిరేశన్, మీనాక్షి దంపతులు కోర్టును ఆశ్రయించారు.అయితే ఈ కేసు విచారణలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ నడుస్తూ ఉంది.ధనుష్ మా రక్తం అని కదిరేశన్ దంపతులు కోర్టు కు విన్నవించగా,ధనుష్ మాత్రం వారు తన తల్లిదండ్రులు కాదంటూ వాదిస్తున్నాడు.కదిరేశన్ దంపతులు మాత్రం హీరో ధనుష్ చెన్నైలోని పాఠశాలలో చదువుకున్న ఆధారాలను, ఆయన పదవ తరగతి పరీక్షలు రాసిన పత్రాలతో పాటు టీసీలో పుట్టుమచ్చల వివరాలను కూడా మధురై కోర్టుకు సమర్పించినప్పటికీ కింది కోర్టులో హీరో ధనుష్‌కి అనుకూలంగా తీర్పు రావడం తో వారు హైకోర్టు‌ను ఆశ్రయించారు.

 Chennai Court Gets Very Angry On Hero Dhanush And Asked For His Birth Certifica-TeluguStop.com

అయితే ఈ నేపథ్యంలో కోర్టు హీరో ధనుష్ కు బర్త్ సర్టిఫికెట్ విషయంలో డెడ్ లైన్ ఇచ్చినట్లు తెలుస్తుంది.15 రోజుల్లో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ సమర్పించాలి అంటూ కోర్టు స్పష్టం చేసింది.ఈ కేసుపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిగినప్పటికి గత మూడేళ్ళ లో ఎలాంటి పురోగతి మాత్రం కనిపించలేదు.తాజాగా ఈ కేసు విచారణ జరిపిన హైకోర్టు ధనుష్ పై ఆగ్రహం వ్యక్థము చేసి ఈ కేసు వ్యవహారంలో 15 రోజుల్లోగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ సమర్పించాలి అంటూ లేదంటే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని కోర్టు స్పష్టం చేసింది.

ఎందుకు ఇంత వరకూ కోర్టులో జనన, స్థల, విద్యా పత్రాలను సమర్పించలేదని ధనుష్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది కోర్టు.అయితే మరికొంత సమయం కోరటంతో 15 రోజుల్లోగా జనన, విద్య, ఇంటి ఒరిజినల్ పత్రాలను సమర్పించాలని ఈ విషయంలో చెన్నై కార్పొరేషన్ కల్పించుకోవాలని ఆదేశించింది కోర్టు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube