చదువు కోసం ఫోన్ దొంగతనం చేసిన బాలుడు.. పోలీసులు ఊహించని ట్విస్ట్!  

chennai boy snatche phone to attend online classes police gifts him one chennai boy, snatches, phone, attend online classes, police gifts - Telugu Attend Online Classes, Chennai Boy, Phone, Police Gifts, Snatches

ప్రస్తుతం కరోనా కారణంగా స్కూల్స్ అన్ని మూతబడ్డాయి.ఈ కరోనా వల్ల స్కూల్స్ ఇప్పుడే తెరవని పరిస్థితిలో ప్రతి ఒక్క విద్యాసంస్థలు కూడా ఆన్లైన్ తరగతులను ప్రారంభించాయి.

TeluguStop.com - Chennai Boy Snatches The Phone To Attend Online Classes Police Gifts Him One

అయితే ఆన్లైన్ తరగతులు వినాలంటే ప్రతి ఒక్క విద్యార్థికి స్మార్ట్ ఫోన్ లేదా ఇతర గాడ్జెట్లు ఉండాలి.మరి అవి లేని వారి పరిస్థితి ఏమిటి? చెన్నైకు చెందిన ఒక బాలుడి పరిస్థితి ఇది.అతనికి చదువుపై ఉన్న శ్రద్ధ, దొంగగా మార్చింది.అందరిలాగా ఆన్లైన్ తరగతులను వినలేక పోతున్నాను అనే బాధ ఒకవైపు, తల్లిదండ్రులకు ఫోన్ కొని ఇవ్వలేని పేదరికం ఒకవైపు.

అయితే తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ఫోను దొంగలించి పోలీసులకు దొరికిపోయాడు.పూర్తి వివరాల్లోకి వెళితే….

TeluguStop.com - చదువు కోసం ఫోన్ దొంగతనం చేసిన బాలుడు.. పోలీసులు ఊహించని ట్విస్ట్-General-Telugu-Telugu Tollywood Photo Image

చెన్నైకు చెందిన ఈ 13 ఏళ్ల బాలుడు స్మార్ట్ ఫోన్ దొంగలించి పట్టుబడ్డాడు.అందుకు కారణం అతనికి చదువు మీద శ్రద్ధ.

తన తల్లి ఇళ్ళలో పని చేసేది.తన తండ్రి ఒక బిస్కెట్ షాప్ లో పని చేస్తున్నాడు.

ఆ బాలుడు చదువుకోవాలంటే స్మార్ట్ ఫోన్, అందులో ఇంటర్నెట్ అన్ని సదుపాయాలు కలిగి ఉండాలి.అన్ని సదుపాయాలు కలిగిన ఫోన్ కొనగలిగే సామర్థ్యం వారి తల్లిదండ్రుల దగ్గర లేకపోవడం వల్ల ఈ దొంగతనం చేశానని బాలుడు ఒప్పుకున్నాడు.

అయితే ఈ బాలుడు ఉద్దేశ్యపూర్వకంగా చేసినది కాదని, ఇద్దరు ముఠా దొంగలు ఆ బాలుడి చేత ఈ పని చేయించారు అని పోలీసుల విచారణలో తేలింది.

ప్రతిరోజు స్కూల్ దగ్గరికి వస్తున్నా ఇద్దరు ముఠా దొంగలు ఆ బాలుడికి మాయమాటలు చెప్పి స్మార్ట్ ఫోన్ దొంగతనం చేస్తే, ఆన్లైన్ క్లాసులు చదువుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.

దీంతో ఆ బాలుడు చేసేదేమీ లేక తిరువోట్టియూర్ ఒక ట్రక్కు డ్రైవర్ ఫోన్ దొంగతనం చేశాడని తిరువోట్టియూర్ క్రైమ్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఎస్ భువనేశ్వరి పేర్కొన్నారు.అయితే ఇన్స్పెక్టర్ భువనేశ్వరి మాట్లాడుతూ తనకు చదువుకోవాలనే కోరిక తనతో ఈ పని చేయించిందని.

అయితే తన కూతురికి కొనివ్వాలి అనుకున్న ఫోన్ డబ్బులతో ఆ బాలుడికి ఫోన్ కొనిచ్చింది.నా ఈ నిర్ణయానికి నా కూతురు ఎంతో సంతోష పడుతుందని ఆమె వెల్లడించారు.ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట్లో వైరల్ గా మారింది.

#Chennai Boy #Snatches #Police Gifts #AttendOnline #Phone

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Chennai Boy Snatches The Phone To Attend Online Classes Police Gifts Him One Related Telugu News,Photos/Pics,Images..