ఈ సీజన్ ఐపీఎల్ నుంచి చెన్నై, పంజాబ్ ఔట్

ఈ ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ , కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కథ ముగిసింది.ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై గెలుపొందింది.

 Punjab And Chennai Teames Out From Ipl Season-TeluguStop.com

చెన్నై గెలుపుతో పంజాబ్ ప్లే ఆప్స్ ఆశలు గల్లంతయ్యాయి.చావోరేవో తేల్చుకోవాల్చిన మ్యాచ్‌లో పంజాబ్ డీలాపడిపోయింది.

పంజాబ్ బ్యాట్స్‌మెన్స్‌తో పాటు బౌలర్లు పేలవ ప్రదర్శనం చూపించారు.

టాస్ గెలిచిన చెన్నై జట్టు బౌలింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 153/6 పరుగులు మాత్రమే చేసింది.

ఓపెనర్లు అయిన కెప్టెన్ కేఎల్ రాహుల్ 29, మయాంక్ అగర్వాల్ 26 పరుగులు చేయగా.గేల్ 12, పూరన్ 2, మన్ దీప్ 14 పరుగులకే ఔటయ్యారు.

ఈ క్రమంలో బ్యాటింగ్కు వచ్చిన దీపక్ హుడా 30 బాల్స్‌కి 62 పరుగులు చేయడంతో పంజాబ్ 153 పరుగులు చేయగలిగింది.

ఇక లక్ష్యాన్ని చేధించేందుకు బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టు.18.5 ఓవర్లలో 154/1 పరుగులు చేసి విజయం సాధించింది.గైక్వాడ్ 62 పరుగులు చేయగా.డూప్లెసిస్ 48, అంబటి రాయుడు 30 పరుగులు చేశారు.ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిచినా సరే.పాయింట్ల పట్టికలో ఆ జట్టు చివరి స్థానంలో ఉండటంతో ప్లే ఆప్స్‌కు అర్హత సాధించలేకపోయింది.దీంతో చివరి మ్యాచ్‌లో గెలిచిన ఆనందంలో ఇంటిబాట పట్టింది.ఇక కీలక మ్యాచ్‌లో పంజాబ్ గెలవలేకపోవడంతో ప్లే ఆప్స్‌కి చేరుకోలేకపోయింది.దీంతో పంజాబ్ జట్టు కూడా ఈ సీజన్ నుంచి బయటికి రానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube