దేశంలో నేరాలే జరగడం లేదా, ప్రశ్నిస్తున్న దిశ నిందితుడి భార్య  

Chenna Keshavulu Wife Comments On Her Husband-disha Murder Accussed Wife,hyderabad Police Encounter Chenna Keshavulu

మా ఆయన ని కొద్ది రోజుల తరువాత ఇంటికి పంపిస్తామని చెప్పారు, ఎక్కడ మా ఆయన? , ఇలా ఎంకౌంటర్ చేసేస్తారా? అని దిశ ఘటన లో నిందితుడు అయిన చెన్నకేశవులు భార్య అడుగుతున్న ప్రశ్నలు ఇవి.నా ముఖం చూసి అయినా పంపిస్తారని అనుకున్నా, ఇలాంటి కేసులు మస్తు అయినవి వారందరిని విడిచిపెట్టి వీళ్ళను మాత్రమే ఎందుకు ఎంకౌంటర్ చేశారు సార్ అంటూ ప్రశ్నిస్తుంది.

Chenna Keshavulu Wife Comments On Her Husband-disha Murder Accussed Wife,hyderabad Police Encounter Chenna Keshavulu Telugu Viral News Chenna Keshavulu Wife Comments On Her Husband-disha Murder Accuss-Chenna Keshavulu Wife Comments On Her Husband-Disha Murder Accussed Hyderabad Police Encounter

గతనెల 27 రాత్రి హైదరాబాద్ లోని షాద్ నగర్ లో వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం,హత్య ఘటన దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే.ఈ ఘటనలో ఇద్దరు లారీ డ్రైవర్లు,ఇద్దరు క్లీనర్ లు కలిసి మాటు వేసి మరి దిశ ను కిడ్నాప్ చేసి అత్యాచారం కి పాల్పడడమే కాకుండా ఆమె ప్రాణాలను సైతం తీసి, చివరికి పెట్రోల్ పోసి తగులబెట్టారు.

దేశ రాజధాని ఢిల్లీ లో జరిగిన నిర్భయ ఘటన తరువాత అంతే తీవ్ర స్థాయిలో ఈ ఘటన పై దేశ వ్యాప్తంగా పలువురు ఆ నిందితులను శిక్షయించాలని డిమాండ్ లు వెల్లువెత్తాయి.

అయితే ఈ ఘటనలో నిందితులు శుక్రవారం సీన్ రీకన్ స్ట్రక్షన్ కు తీసుకువెళ్లగా ఆ సమయంలో తప్పుంచుకొనేందుకు ప్రయత్నించి పోలీసుల వద్ద ఆయుధాలను లాక్కొని వారి పై కాల్పులకు తెగబడడం తో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు.

దీనితో ఆ నలుగురు ఎంకౌంటర్ లో మృతి చెందిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఒక నిందితుడు అయిన చెన్నకేశవులు భార్య ఈ ఎంకౌంటర్ పై స్పందిస్తూ మీ ఆయన్ను పంపిస్తామని చెప్పారు.

ఏమి కాదని చెప్పి ఇలా ఎంకౌంటర్ ఎలా చేస్తారు అని ప్రశ్నించింది.ఎన్నో కేసులు అవుతున్నాయి వారందరినీ విడిచిపెట్టి ఇలా వీరిని మాత్రం ఎంకౌంటర్ చేసారు.

వీళ్ళు అంత దారుణం చేశారా సార్.మాఆయనను ఎక్కడ అయితే చంపారో అక్కడే నన్ను కూడా తీసుకెళ్లి కాల్చి చంపండి అంటూ వ్యాఖ్యలు చేసింది.

అంతేకాకుండా భూమ్మీద ఇలాంటి ఘోరాలు జరగలేదా,నా భర్త ఒక్కడే చేసినట్లు దానొక్కదాని కోసం నలుగురు ప్రాణాలు తీస్తారా , 9 నెలల పిల్లను చేసినోడ్ని ఏమో జైల్లో పెట్టి పందుల్లా మేపుతున్నారు.

వీళ్ళను మాత్రం ఇలా ఎంకౌంటర్ చేసి చంపేశారు.

కనీసం గర్భవతి అన్న కనికరం లేకుండా అట్లా ఎట్లా చేస్తారు అంటూ ప్రశ్నించింది.నా భర్త లేకుండా నేను మాత్రం బ్రతకలేను,నన్ను కూడా చంపేయండి పెండ్లయి సంవత్సరం కూడా కాలేదు.

భర్త లేకుండా ఎలా బ్రతకాలి నేను, అందుకే నన్ను కూడా మా ఆయన్ని చంపిన చోటే నన్ను కూడా చంపేయండి అంటూ కోరింది.

.

తాజా వార్తలు