వేసవిలో చెమ‌ట‌కాయ‌లు పోవాలంటే...అద్భుతమైన చిట్కాలు.?  

Chemata Pokkulu Thaggalante Emi Cheyali.?-

వేసవి కాలం వచ్చేసింది.వేసవి కాలంలో ప్రతి ఒక్కరు ఎదుర్కొనే అతముఖ్యమైన సమస్యల్లో చెమటకాయల సమస్య ఒకటి.వీటి కారణంగా చర్మం దురపెట్టటమే కాకుండా చర్మం మృదుత్వాన్ని కోల్పోతుంది.కొన్ని సహజసిద్ధమైచిట్కాలను పాటిస్తే చాలా సులభంగా చెమటకాయల నుండి బయట పడవచ్చు.ఇప్పుడు చిట్కాల గురించి వివరంగా తెలుసుకుందాం.

Chemata Pokkulu Thaggalante Emi Cheyali.?---

కలబంద

చెమటకాయలు ఉన్న ప్రదేశంలో కొంచెం కలబంద గుజ్జు రాస్తే త్వరగతగ్గిపోతాయి.కలబందలో ఆస్ట్రిజెంట్ లక్షణాలు ఉండుట వలన చెమటకాయలు త్వరగతగ్గటానికి సహాయపడతాయి.అంతేకాకుండా చర్మంపై ఉండే ఇన్‌ఫెక్షన్లను కూడతగ్గిస్తుంది.

టీ ట్రీ ఆయిల్

టీ ట్రీ ఆయిల్‌లో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు సమృద్ధిగఉంటాయి .

కొంచెం టీ ట్రీ ఆయిల్‌ను తీసుకుని దానికి కొంచెం నీటిని కలిపమిశ్రమంగా తయారు చేయాలి.ఆ మిశ్రమంలో కాటన్ బాల్‌ను ముంచి చర్మంపై రాస్తచెమట కాయలు చాలా త్వరగా తగ్గిపోతాయి.

Chemata Pokkulu Thaggalante Emi Cheyali.?---

వెనిగర్

వెనిగర్‌లో ఉండే అసిటిక్ యాసిడ్‌కు చర్మాన్ని సంరక్షించే లక్షణాలు ఉండువలన చెమటకాయలను తగ్గించటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.టిష్యపేపర్‌ను తీసుకుని వెనిగర్‌లో ముంచి చెమట కాయలు ఉన్న ప్రదేశంలో అద్దాలిఇలా చేస్తే చెమట కాయలు త్వరగా తగ్గిపోతాయి.

లవంగ నూనె

లవంగ నూనెలో చర్మాన్ని సంరక్షించే ఎన్నో లక్షణాలు ఉన్నాయి.కాటన్ బాల్‌నతీసుకుని లవంగ నూనెలో ముంచి చెమటకాయలు ఉన్న ప్రదేశంలో రాస్తే చెమట కాయలతగ్గుముఖం పడతాయి.

తరచూ ఇలా చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.