చాక్లెట్‌తో అద్భుతం చేసిన చెఫ్‌.. ఏం చేశాడంటే..?

చాక్లెట్​ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు.చిన్న పిల్లల నుంచి పెద్ద వారికి అందరికీ చాక్లెట్​ అంటే ఇష్టమే.

 Chef Who Did Wonders With Chocolate By Recreating Statue Of Liberty , Liberty, C-TeluguStop.com

కానీ పిల్లల ఆరోగ్యం చెడిపోతుందని, లావు అవుతారని చాక్లెట్లను దూరం పెడుతూ ఉంటాం.ఇంతకీ ఇప్పుడు ఈ చాక్లెట్​ కబుర్లు ఎందుకంటారా ? ఇప్పుడు అదే టాపిక్​ చెప్పుకోబోతున్నాం.

సాధారణంగా చాక్లెట్​తో ఏం తయారు చేస్తాం.ఇదేం ప్రశ్నండి.చాక్లెట్​తో ఏం తయారు చేస్తాం సుబ్బరంగా తింటాం కానీ అంటారా ? అవును మాములుగానైతే చాక్లెట్​ను తింటాం.కానీ చాక్లెట్​తో తయారు చేసే పదర్థాలతో కొన్నింటిని తయారు చేస్తాం.

బేకరీలలో కొన్ని ఉత్పత్తులు తయారు చేస్తారు.చాక్లెట్​ కేక్​, చాక్లెట్​ డ్రింక్​, చాక్లెట్​ కాఫీ.

ఇలా వివిధ పదార్థాలు తయారు చేస్తారు.కొన్ని రకాల ఐస్​ క్రీముల్లో చాక్లెట్​ ఫేవర్లు కూడా ఉంటాయి.

అయితే కొందరు కళాకారులు మాత్రం చాక్లెట్​తో వివిధ రకాల కళాకృతులు తయారు చేస్తుంటారు.చాక్లెట్ తో బొమ్మలు, వివిధ దేశాలల్లో ముఖ్యమైన కట్టడాలు చేస్తారు.

Telugu Feets, Cheff, Netizens, Replicastatue, Statue Liberty-Latest News - Telug

అలాగే ఈ సారి ఓ కళాకారుడు ఏకంగా 7 అడుగుల ఎత్తుతో అమెరికాలో ఉండే స్టాచ్యూ ఆఫ్​ లిబర్టీ విగ్రహాన్ని తయారు చేశాడు.దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో హల్​ చల్​ చేస్తోంది.దీనిని ఇప్పటి వరకు ఏకంగా 8 లక్షల వ్యూస్​ వచ్చాయి.

ముందుగా లిక్విడ్​ లాంటి చాక్లెట్​ను తీసుకొని స్టాచ్యూ ఆఫ్​ లిబర్టీ కింద ఉండే బిల్డింగ్​ ఆకృతిని తయారు చేశారు.

అంటే అదేదో ఆశామాషీగా తయారు చేయాలేదు.ఓ ఇంజనీర్​లాగా ప్రత్యేకంగా కొలతలు తీసుకొని, ప్రతీ భాగాన్ని ఎంతో శ్రద్ధతో తయారు చేశారు.

Telugu Feets, Cheff, Netizens, Replicastatue, Statue Liberty-Latest News - Telug

దానికి ఉండే తలుపులు, కిటికీలు, ఇలా ఒక్కో భాగాన్ని ఎంతో ఓపికతో, ఆసక్తితో చేశారు.అనంతరం స్టాచ్యూ ఆఫ్​ లిబర్టీ విగ్రహన్ని కూడా అంతే అందంగా, కచ్చితమైన కొలతలతో తయారు చేశారు.ఆ విగ్రహాన్ని ఈ బిల్డింగ్​ బొమ్మపై నిలబెట్టాడు.ఈ తయారీ విధానం అంతా రికార్డ్​ చేసి సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు.ఇప్పడది వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube